Mobile Popup Ad
Mobile Popup Ad

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై చిరుమర్తి లింగయ్య ఫైర్

కలం, నల్లగొండ :  నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య (Chirumarthi Lingaiah) రాష్ట్ర కాంగ్రెస్ (Congress) ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. నల్లగొండ (Nalgonda) జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకు చేసిందేమీ లేదని ఆరోపించారు. ‘దోచుకోవడం-దాచుకోవడం’ అనే ధోరణితో ప్రభుత్వం నడుస్తోందని విమర్శించారు. అలాగే మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు, అమలు కాని హామీలను ప్రజలకు వివరిస్తున్నందుకే బీఆర్ఎస్ నేతలపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

ముఖ్యంగా ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యపై లింగయ్య తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఉద్యమ నాయకుడు హరీశ్ రావును విమర్శించే స్థాయి ఐలయ్యకు లేదు. ఆయనపై విమర్శలు చేస్తే మంత్రి పదవి వస్తుందని భ్రమపడుతున్నారు. హరీశ్ రావు గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని తేల్చి చెప్పారు. సామాన్య ప్రజలను ఆసరాగా చేసుకొని ఐలయ్య వేల కోట్లు గడించారని, యాదాద్రి భువనగిరి జిల్లాలో రియల్ ఎస్టేట్ పేరిట వందల కుటుంబాలను రోడ్డున పడేశారని ఆరోపించారు. ‘2023 ఎన్నికల అఫిడవిట్‌లో 30 ఎకరాలు మాత్రమే చూపిన వ్యక్తికి, మూడు గ్రామాలలోనే  250 ఎకరాలు ఎలా వచ్చాయి?’ అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి దమ్ముంటే ఐలయ్యపై ఈడీ, సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తోందని, ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెడుతోందని ఆరోపించారు. వరంగల్ రైతు డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ రైతులను మోసం చేసిందని విమర్శించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>