Mobile Popup Ad
Mobile Popup Ad

యూఏఈ పోర్టుపై ఇరాన్ దాడిలో ఇండియన్లకు గాయాలు.. ఖండించిన మోదీ

కలం, నేషనల్ డెస్క్: యూఏఈలోని (UAE) ఓడరేవు లక్ష్యంగా ఇరాన్ చేపట్టిన డ్రోన్ దాడిలో ముగ్గురు భారతీయులు గాయపడ్డారు. ఈ ఘటనపై భారత్ నిరసన వ్యక్తం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. పౌరుల భద్రత విషయంలో ఇటువంటి చర్యలను సహించేది లేదని స్పష్టం చేశారు. విదేశాంగ శాఖ ద్వారా ఈ విషయాన్ని ఇరాన్ దృష్టికి తీసుకెళ్లాలని అధికారులను మోదీ ఆదేశించారు.

విదేశాల్లో ఉన్న భారతీయుల భద్రతే తమ మొదటి ప్రాధాన్యత అని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది. గాయపడిన భారతీయులకు మెరుగైన వైద్య సహాయం అందేలా యూఏఈ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. కాగా, ఇరాన్ నుంచి ప్రయోగించిన 12 బాలిస్టిక్ మిసైళ్లు, 3 క్రూయిజ్ మిసైళ్లు, 4 డ్రోన్లను యూఏఈ అడ్డుకున్నది. అయితే.. వీటిలో కొన్ని డ్రోన్ దాడుల కారణంగా ఫుజైరా చమురు పరిశ్రమ జోన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

Read Also: బీజేపీ కీలక నిర్ణయం.. బెంగాల్ కు మహిళ సీఎం.. !

Follow Us On :  WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>