కలం, వెబ్‌డెస్క్: విశ్వనగరంగా చెప్పుకునే హైదరాబాద్‌లో మంచినీటి కొరత ఉండడం దౌర్భాగ్యమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకంట్ల కవిత(Kavitha) విమర్శించారు. జనం జాగృతి బాటలో భాగంగా ఆదివారం నగరంలోని ఎంఎస్ మక్తాలో పర్యటించిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. నగరంలోని కొన్ని ఏరియాల్లో మురుగు కలసిపోయి మంచినీరు నల్లగా వస్తోందన్నారు. మరికొన్ని చోట్ల మంచినీటిలో పెట్రోల్ కలసి వస్తోందని చెప్పారు. నీటి కొరత లేకుండా చేయడానికి కొండపోచమ్మ సాగర్ నుంచి నగరానికి నీటిని తేవాలని సూచించారు. ఈ మేరకు ఆయా ప్రాంతాల్లో సేకరించిన నీటి బాటిళ్లను చూపారు. జాగృతి బాటలో భాగంగా ఎలక్షన్ కోడ్ లేని ప్రాంతాల్లో ఇప్పటివరకు పర్యటించి, ప్రజల సమస్యలు తెలుసుకున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందన్నారు.
ప్రైవేటు పరం చేసేందుకే ఎలక్ట్రిక్ బస్సులు:
ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేసే యత్నాల్లో భాగంగానే ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టిందని కవిత(Kavitha) Kavitha slams Telangana Govt Over Spurious Water in Hyderabad
విమర్శించారు. ఇప్పటికే ఉచిత ప్రయాణం పేరుతో నగరంలో 7,500 బస్సులను 3,500కు తగ్గించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. నగరంలో చాలా చోట్ల రోడ్లు సరిగా లేవని, సరైన రోడ్లు లేకపోతే విశ్వనగరం ఎలా అవుతుందని ప్రశ్నించారు. పారిశుద్ధ్య కార్మికుల కొరత వల్ల నగరంలో ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోతోందన్నారు. వీధి కుక్కల సమస్య ఎక్కువైందన్నారు. కొన్ని ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలు ఎక్కువవయ్యాయని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లను అర్బన్ ప్రాంతంలోనూ ఇవ్వాలని కోరారు.
Read Also: అధికారమే టార్గెట్‌గా కేసీఆర్ పక్కా వ్యూహం
Follow Us On: X(Twitter)


