కలం, వెబ్ డెస్క్: అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీ(Brown University)లో కాల్పులు కలకలం రేపాయి. ఇందులో ఇద్దరు స్టూడెంట్లు మృతి చెందగా.. 8 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సీరియస్ అయ్యారు. తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ లో డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ.. కాల్పులు చేయడం సిగ్గుమాలిన చర్య అని.. బాధితుల కోసం ప్రార్థించడం తప్ప మనం ఏమీ చేయలేమని తెలిపారు. ఎఫ్ బీఐ ఆఫీసర్లు ఘటనా స్థలంలోనే ఉన్నారని.. నిందితుడి కోసం గాలిస్తున్నట్టు వివరించారు. అయితే ముందు నిందితుడు కస్టడీలో ఉన్నట్టు చెప్పినా.. అది నిజం కాదని అధికారులు స్పస్టం చేశారు.
Read Also: చర్చలు జరుపుతాం.. మెక్సికో సుంకాలపై భారత్..!
Follow Us On: Pinterest


