కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌కు ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ మేనియా పట్టుకుంది. మెస్సీ(Lionel Messi) రాకతో నగరంలో ఒక ప్రత్యేకమైన వాతావరణం కనిపిస్తోంది. భారీ హోర్డింగ్‌లు, అభిమానుల కేరింతలతో సందడి నెలకొంది. ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా మెస్సీ ఫలక్ నుమా ప్యాలెస్‌కు చేరుకున్నారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) స్వయంగా మెస్సీకి ఘనస్వాగతం పలికారు.
మీట్ అండ్ గ్రీట్‌లో భాగంగా ఫలక్నుమాప్యాలెస్లో అభిమానులతో ఫొటోలు దిగారాయన. మెస్సీని కలిసేందుకు 250 మందికి అనుమతి ఇచ్చారు. రాత్రి 7 నుండి 7.30 గంటల ప్రాంతంలో స్టేడియంకు చేరుకుంటారు. దాదాపు గంటసేపు ఆయన మైదానంలో ఉంటారు. చివరి ఐదు నిమిషాల్లో సీఎం రేవంత్(Revanth Reddy) టీమ్‌తో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనున్నారు. ఈ అరుదైన దృశ్యాలను చూసేందుకు ఇప్పటికే అభిమానులు భారీగా ఉప్పల్‌కు చేరుకున్నారు. మెస్సీ టూర్ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీతో ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు రామ్ లీలా మైదానంలో ఓటు చోరీ అంశంపై నిర్వహించే నిరసన కార్యక్రమంలో పాల్గొననున్నారు.
Read Also: స్పెషల్ ఫ్లైట్ లో రాత్రికి రాత్రే ఢిల్లీకి రాహుల్, రేవంత్… ఆంతర్యమేంటి?
Follow Us On: Pinterest


