కలం డెస్క్: ఇంటర్నేషనల్ ఫుట్ బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ మ్యాచ్ కు టికెట్లు ఉన్న వాళ్లు మాత్రమే రావాలన్నారు రాచకొండ సీపీ సుధీర్ బాబు (CP Sudheer Babu). మెస్సీ గోట్ ఇండియా టూర్ కు 3 వేల మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేసినట్టు వివరించారు. గ్రౌండ్ లోపలికి ల్యాప్ టాప్స్, బ్యానర్లు, కెమెరాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, పెన్నులు, బ్యాటరీలు, తినే ఆహారాలు, వాటర్ బాటిళ్లు, అగ్గిపెట్టెలు, లైటర్లు, సిగరెట్లకు అనుమతి లేదని స్పష్టం చేశారు సీపీ సుధీర్ బాబు . రేపు రాత్రి ఉప్పల్ స్టేడియంలో రాత్రి 7 గంటలకు ఫ్రెండ్లీ మ్యాచ్ ఉంటుందని.. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి, మెస్సీతో పాటు ఇతర ఇంటర్నేషనల్ ఫుట్ బాల్ స్టార్లు పాల్గొంటారని తెలిపారు సీపీ సుధీర్ బాబు.
Read Also: డ్రైనేజీలో బ్యాలెట్ పేపర్లు.. నల్లగొండ జిల్లాలో కలకలం
Follow Us On: X(Twitter)


