కలం, వెబ్ డెస్క్: నోబెల్ శాంతి బహుమతి (Nobel Peace Prize) అందుకున్న ఇరాన్ మహిళా హక్కుల పోరాట యోధురాలు నర్గెస్ మొహమ్మది (Narges Mohammadi ) అరెస్ట్ అయ్యారు. ఇరాన్ లో మానవ హక్కుల లాయర్ రీసెంట్ గా అనుమానాస్పద మృతిలో మరణించారు. ఆయన స్మారక చిహ్నం వద్ద ఆమెను అరెస్ట్ చేసినట్టు మద్దతు దారులు తెలిపారు. దీనిపై ఇరాన్ ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. ఆమె మూడు దశాబ్దాలకు పైగా మహిళల హక్కుల కోసం ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతోంది. ఎన్నోసార్లు జైలుకు వెళ్లింది. లాఠీ దెబ్బలు తిన్నది. ఆమె పోరాటానికి గుర్తింపుగా 2023లో నోబెల్ బహుమతి అందుకున్నారు.
Read Also: 17ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్ సూర్యవంశీ
Follow Us On: Instagram


