కలం, వెబ్ డెస్క్ : దిగ్గజ ఫుట్ బాల్ ఆటగాడు లియోనల్ మెస్సీ (Lionel Messi) హైదరాబాద్ పర్యటనతో తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు అని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్పష్టం చేశారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు తిరిగి వస్తున్న సందర్భంగా పార్లమెంట్ ఆవరణలో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. మెస్సీ పర్యటనను ఓ ప్రైవేట్ సంస్థ నిర్వహిస్తోందని తెలిపారు.
అంతర్జాతీయ స్థాయి క్రీడాకారుడు రాష్ట్రానికి వస్తున్నందున కేవలం అవసరమైన సాయం మాత్రమే ప్రభుత్వం అందిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలిపారు. ముఖ్యమంత్రిగా ఉన్నందున తాను కూడా ఈ కార్యక్రమానికి అతిథిగా మాత్రమే హాజరవుతున్నట్టు ఆయన చెప్పారు. ఈ ఈవెంట్ కు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు తెలిపారు.
అలాగే, ఢిల్లీ కలిసిన అందరినీ మెస్సీ ఫుట్ బాల్ మ్యాచ్ కు ఆహ్వానించినట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. మెస్సీ గోట్ ఇండియా టూర్‌లో (GOAT India Tour) భాగంగ ఈ నెల 13న లియోనల్ మెస్సీ హైదరాబాద్ లో పర్యటించనున్నారు. ఉప్పల్ స్టేడియంలో జరిగే ఎగ్జిబిషన్ మ్యాచ్ లో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆడనున్నారు. మెస్సీ పర్యటన వేళ హైదరాబాద్ నగరంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.
Read Also: రాష్ట్రపతి రాకకు వేళాయే.. 17 నుంచి 21 వరకు ముర్ము టూర్
Follow Us On: Pinterest


