కలం, వెబ్ డెస్క్: అమెరికా అనగానే.. ఉన్నత చదువులు, ఉద్యోగ అవకాశాలకు గమ్యస్థానం. కేవలం ఇండియన్స్ మాత్రమే కాకుండా.. విదేశీ విద్యార్థులు సైతం రెక్కలు కట్టుకొని అక్కడ వాలిపోతుంటారు. కానీ అమెరికా గ్రాడ్యుయేట్ల (US Graduates) కు మాత్రం కొద్దిరోజులుగా పరిస్థితులు ఆశాజనకంగా లేవు. తాజా పరిణామాల ప్రకారం.. యునైటెడ్ స్టేట్స్‌లోని కళాశాల గ్రాడ్యుయేట్లలో దాదాపు సగం మంది నైపుణ్యం ఉన్నా.. డిగ్రీ అవసరం లేని ఉద్యోగాల్లో పనిచేస్తున్నారట.
బర్నింగ్ గ్లాస్ ఇన్స్టిట్యూట్, స్ట్రాడా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ అధ్యయనాల ప్రకారం.. ఇటీవల బ్యాచిలర్ గ్రాడ్యుయేట్లలో దాదాపు సగం మంది తమ అర్హతకు మించి తక్కువ ఉపాధి పొందున్నారు. డిగ్రీ అవసరం లేని ఉద్యోగాల్లో పనిచేస్తున్నారని ఈ అధ్యయనం నివేదించింది. యునైటెడ్ స్టేట్స్ (US) అంతటా కళాశాలల్లో ఇటీవల పట్టభద్రులైన వారిలో దాదాపు 52% మంది లేబర్, హాస్పిటాలిటీ, ఇతర గిగ్ల లాంటి నైపుణ్యం లేని ఉద్యోగాల్లో పనిచేస్తున్నారు.
దీనికి అనేక కారణాలు కూడా ఉన్నాయి. ఉన్నత చదువుల కోసం ఇతర దేశాల నుంచి అమెరికాకు పెద్ద సంఖ్యలో స్టూడెంట్స్ రావడం ప్రధాన కారణంగా తెలుస్తోంది. అలాగే ఆర్థిక మాంద్యం, పలు విద్యాసంస్థలపై ట్రంప్ ఆంక్షలు విధించడం కూడా కారణంగా తెలుస్తోంది. అమెరికాకు వెళ్లే విద్యార్థుల్లో ఇండియా, చైనా అగ్రస్థానంలో ఉన్నాయి. వెరసి అమెరికా గ్రాడ్యుయేట్ల (US Graduates) కు వారి దేశంలోనే తగిన ఉద్యోగాలు కరువయ్యాయి.
Read Also: లోడ్‌తో దిగితే బ్యాటరీ ఫుల్.. చైనా ట్రక్కులకు కొత్త టెక్నాలజీ
Follow Us On: X(Twitter)


