కలం డెస్క్: హైదరాబాద్‌లోని ఫేమస్ తాజ్ బంజారా (Taj Banjara) హోటల్‌కు కొత్త యజమాని వచ్చారు. ప్రముఖ కంపెనీ అరబిందో గ్రూప్ (Aurobindo Group) తాజా బంజారును కొనుగోలు చేసింది. అరబిందో గ్రూప్ కు చెందిన అరో రియాలిటీ సంస్థ తాజ్ బంజారాను సొంతం చేసుకున్నది. హైదరాబాద్‌లో ఇటీవల రియల్ ఎస్టేట్ పుంజుకుంటున్నది. జీహెచ్ఎంసీ వేలం వేసిన భూములు ఎకరా వందల కోట్ల ధర పలికింది. కోకా పేటలో ఎకరం రూ.151కోట్లు కూడా పలికింది. తాజాగా తాజ్ బంజారా హోటల్‌ను అరో రియాల్టీ వాళ్లు రూ.315కోట్లకు సొంతం చేసుకున్నారు.
గత అక్టోబర్ 31న ఈ డీల్ ముగిసినట్టు సమాచారం. (Aurobindo Group) అరబిందో గ్రూప్ ఒక అతిపెద్ద హోటల్‌ను, చారిత్రాత్మక నిర్మాణాన్ని సొంతం చేసుకున్నదని చెప్పొచ్చు. బంజారాహిల్స్ వంటి ప్రధాన ప్రీమియం ప్రాంతంలో జరిగిన అత్యంత పెద్ద కేటాయింపుల్లో ఒకటిగా నిలిచింది. కొనుగోలు కోసం స్టాంప్ డ్యూటీగా రూ.17.3 కోట్లు చెల్లించారు. హోటల్ మొత్తం 3.5 ఎకరాల్లో, మొత్తం 16,645 చదరపు గజాల విస్తీర్ణంలో ఉంది. 1.22 లక్ష చదరపు అడుగుల బిల్ట్-అప్ ఏరియాతో, 270 పైగా గదులతో విస్తరించి ఉంది.
తాజ్ బంజారా (Taj Banjara), ఒకప్పుడు తాజ్ గ్రూప్ ఫ్లాగ్‌షిప్ హోటల్‌గా గుర్తింపు పొందింది. కానీ ఆపరేషనల్ సమస్యలు, జీహెచ్‌ఎంసీ నుంచి క్లోజర్ నోటీసులు వంటి సవాళ్లతో ఎదుర్కొంది. ఇప్పుడు ఆరు రియాల్టీ హోటల్‌ను పునర్వ్యవస్థీకరించడానికి, లేదా హై-ఎండ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌లో మార్పు చేసేందుకు అవకాశాలు పరిశీలిస్తోంది. హైదరాబాద్‌లో రెసిడెన్షియల్, కమర్షియల్, మిక్స్‌డ్-యూజ్ ప్రాజెక్ట్‌లలో పెద్దగా విస్తరిస్తున్న ఆరొ రియాల్టీ, తాజ్ బంజారా కొనుగోలుతో ఆతిథ్య రంగంలో దూకుడుగా ముందుకు సాగుతోంది. త్వరలో హోటల్ భవిష్యత్తు, ఆపరేషనల్ ప్రణాళికలపై స్పష్టత వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Read Also: 9 రోజుల్లో 90 కోట్ల లిక్కర్ అమ్మకాలు
Follow Us On: Instagram


