epaper
Friday, January 16, 2026
spot_img
epaper

మొదటి విడత సర్పంచ్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

కలం/ఖమ్మం బ్యూరో: ఖమ్మం (Khammam) జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల (Sarpanch Polls) నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. జిల్లా పరిధిలో మొదటి విడతలో భాగంగా డిసెంబర్ 11న ఏడు మండలాల పరిధిలోని 192 గ్రామపంచాయతీల్లో 20 ఏకగ్రీవం కాగా, 172 సర్పంచ్ స్థానాలకు, 1740 వార్డులకుగాను 2 వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదని, 323 వార్డులు ఏకగ్రీవం కాగా, 1415 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోలింగ్, కౌంటింగ్ ఒకే రోజు జరుగుతాయని.. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరుగుతుందని, మధ్యాహ్నం రెండు గంటల తర్వాత అక్కడే కౌంటింగ్ నిర్వహిస్తామని తెలిపారు.

జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో (Sarpanch Polls) మొత్తం 2 లక్షల 41 వేల 137 మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని, ఇందులో ఒక లక్షా 16 వేల 384 మంది పురుష ఓటర్లు, లక్షా 24 వేల 743 మంది మహిళలు, ఇతరులు 10 మంది ఉన్నారని తెలిపారు. మొదటి దశ 192 గ్రామ పంచాయతీల్లో 20 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయినట్లు, 172 గ్రామ పంచాయతీలలో సర్పంచ్ ఎన్నిక కోసం 488 మంది బరిలో ఉన్నారని, 1740 వార్డులలో 2 వార్డులలో నామినేషన్లు దాఖలు కాలేదని, 323 వార్డులు ఏకగ్రీవంకాగా, 1415 వార్డులలో 3424 మంది పోటీలో ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. మొదటిదశ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు జిల్లాలో 2089 బ్యాలెట్ బాక్సులు అందుబాటులో ఉంచామని, 1899 పోలింగ్ అధికారులు, 2321 ఇతర పోలింగ్ అధికారులు నియమించామని, 7 డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లు, 7 రిసెప్షన్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, కౌంటింగ్ కేంద్రాలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. మొదటి దశ పంచాయతీ ఎన్నికల్లో 36 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ లొకేషన్స్ గుర్తించి, 360 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేశామని, 162 సెన్సిటివ్ కేంద్రాలలో మైక్రో అబ్జర్వర్లను నియమించినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రశాంత, స్వేచ్ఛ, న్యాయబద్ద ఎన్నికల నిర్వహణకు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థులు, వివిధ వర్గాల ప్రజలు తమ సంపూర్ణ సహకారం అందించాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Read Also: 9 రోజుల్లో 90 కోట్ల లిక్కర్ అమ్మకాలు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>