కలం డెస్క్ : ఆధిపత్యాన్ని ప్రదర్శించాలనుకున్న ప్రతిసారీ తిరుగుబాటు తప్పదని హెచ్చరించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (Revanth Reddy).. గతంలో తెలంగాణ గడ్డమీద జరిగిన ఘటనలను గుర్తుచేశారు. కొమురం భీమ్ నుంచి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, తెలంగాణ మలిదశ ఉద్యమం వరకు ఆధిపత్యంపై పోరాటం కొనసాగిందని గుర్తుచేశారు. పీవీ నర్సింహా రావు, జైపాల్ రెడ్డి, జార్జిరెడ్డి, గద్దర్ లాంటి గొప్ప వ్యక్తులను అందించిన ఘనత ఉస్మానియా యూనివర్సిటీదన్నారు. యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, తెలంగాణ గడ్డకు ఒక చైతన్యం, పౌరుషం ఉంది… ఆ చైతన్యం, పౌరుషానికి చదువుతో పనిలేదన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో స్వరాష్ట్ర ఆకాంక్షను బలంగా వినిపించిన గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ అని పేర్కొన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీకి గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వెళ్ళలేదనే చర్చ తెలంగాణ సమాజంలో ఉన్నదని, అందుకే తాను ప్రోగ్రామ్ పెట్టుకుంటే ఎందుకు వెళ్తున్నారనే ప్రశ్నలు మొదలయ్యాయన్నారు. ఎందుకంత ధైర్యం చేస్తున్నావంటూ కూడా కొందరు తనను అడిగారని గుర్తుచేశారు. ఉస్మానియా యూనివర్సిటీకి రావాలంటే కావాల్సింది ధైర్యం కాదు.. అభిమానం.. అని అన్నారు. అందుకే గుండెల నిండా అభిమానాన్ని నింపుకుని యూనివర్సిటీకి అభివృద్ధికి బాటలు వేసేందుకు ఇక్కడికి వచ్చానన్నారు. ఉస్మానియా యూనివర్సిటీని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఇక్కడికి వచ్చానన్నారు. సమస్యలకు శాశ్వత పరిష్కారం కావాలంటే తెలంగాణ సాధనతోనే అని ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు ఆనాడు నడుం బిగించారని, వారి ఆకాంక్షలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని Revanth Reddy అన్నారు.
Read Also: కూకట్పల్లి ఎమ్మెల్యే పై కవిత ఫైర్!
Follow Us On: Instagram


