కలం, వెబ్‌డెస్క్ : భారత్ లో ఎన్నడూ లేని రీతిలో ఇండిగో (Indigo crisis) సంక్షోభం కొనసాగుతోంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఇండిగో ఎయిర్ లైన్స్ పరిస్థితిపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఇండిగో సంక్షోభానికి ఆ సంస్థలో అంతర్గతంగా నెలకొన్న సమస్యలే కారణం అన్నది. ఇండిగో రోస్టరింగ్ విధానం వైఫల్యం కావడం వల్లే ఈ పరిస్థితి నెలకొన్నదని కేంద్రం స్పష్టం చేసింది. మంగళవారం లోక్ సభ సమావేశాల వేళ ప్రతిపక్షాలు ఇండిగో సమస్యపైన ప్రతిపక్షాలు ప్రశ్నలు లేవనెత్తాయి. వీటికి కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) వివరణ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇండిగో ఎయిర్ లైన్స్ సంక్షోభానికి (Indigo crisis) ఆ సంస్థ రోస్టరింగ్ విధానమే కారణమని చెప్పారు. డీజీసీఏ ఇండిగోకు ఇప్పటికే నోటీసులు ఇచ్చిందని.. ఈ సమస్యపై విచారణకు ఆదేశించామని వెల్లడించారు. ప్రయాణికుల భద్రతపై రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రయాణికులు ఇబ్బంది పడితే సంస్థల యాజమాన్యమే బాధ్యత వహించాలని తేల్చిచెప్పారు. ఇండిగో సంక్షోభం భాధ్యులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని రామ్మోహన్ నాయుడు హెచ్చరించారు.
ఇండిగో కార్యకలాపాలు వేగంగా స్థిరీకరించబడుతున్నాయని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. కాగా ఇండిగో సంక్షోభం 8వ రోజూ కొనసాగుతోంది. ఈరోజు దేశవ్యాప్తంగా 250 విమానాలకు పైగా క్యాన్సిల్ అయ్యాయి. పైలట్ల కొరత, ఎఫ్ డీటీఎల్ నిబంధనల కారణంగా ఈ సమస్య తలెత్తింది. మరోవైపు నిర్లక్షంగా వ్యవహరించిన ఇండిగో సంస్థ ఫ్లైట్ల సర్వీసుల్లో 5 శాతం కోత విధిస్తూ హెచ్చరించింది.
Read Also: సోనియా పౌరసత్వం ఆరోపణలపై ప్రియాంక గాంధీ కౌంటర్
Follow Us On: Youtube


