కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరు గ్యారెంటీల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకానికి మహిళల నుంచి పెద్ద ఎత్తున రెస్పాన్స్ వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఆడబిడ్డలు ఉచిత ప్రయాణం చేస్తూ పథకాన్ని ఉపయోగించుకుంటున్నారు. మహాలక్ష్మి పథకం ప్రారంభమై నేటితో రెండేళ్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి స్పందించారు. మహాలక్ష్మి పథకానికి మంచి ఆదరణ వచ్చిందని, రెండేండ్లలో 250 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం (Free Bus Travel) చేశారని వెల్లడించారు.
2023 డిసెంబర్ 9న ఈ పథకం ప్రారంభమైంది. రాష్ట్రంలో ఎన్నిసార్లైనా, ఎక్కడికైనా ప్రయాణించే అవకాశం కల్పించింది. బాలికలు, మహిళలు, ట్రాన్స్ జెండర్లు ఆధార్ కార్డ్ చూపించి ప్రయాణిస్తున్నారు. పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డీనరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 8 నాటికి 251.11 కోట్ల మహిళ ప్రయాణికులు ఈ పథకాన్ని ఉపయోగించుకున్నారు. రూ.8497.52 కోట్ల రవాణా ఛార్జీలను ఆదా చేసుకున్నారు. ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ సంస్థకు తిరిగి చెల్లిస్తుంది.
మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం (Mahalakshmi Free Bus Scheme) అమలు కారణంగా యాదాద్రి లాంటి ప్రముఖ ఆలయాలకు భక్తుల తాకిడి పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దేవాలయాలకు యాత్రికుల సంఖ్య 80 శాతం పెరిగింది. అలాగే ఆలయ ఆదాయం 40శాతం పెరిగింది. తెలంగాణ దేవాదాయ శాఖ ఆదాయం 2023లో దాదాపు రూ.370 కోట్ల నుండి 2024లో రూ.544 కోట్లకు పెరిగింది. ఉచిత ప్రయాణం ద్వారా మహిళలు మెరుగైన వైద్యం సదుపాయం పొందుతుండగా, గ్రామీణ బాలికలు జర్నీ చేస్తూ ప్రముఖ విద్యా సంస్థల్లో చదువుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
Read Also: ‘ప్రజలు అన్నీ గమనిస్తున్నారు’.. కవిత ఆసక్తికర ట్వీట్
Follow Us On: X(Twitter)


