Mobile Popup Ad
Mobile Popup Ad

హైదరాబాద్ లో లవ్​ జిహాద్​.. ఫస్ట్​ నైట్​ రోజు మత్తు మందు ఇచ్చి..

కలం, వెబ్​ డెస్క్​ : హైదరాబాద్​ పంజాగుట్టలో లవ్​ జిహాద్​ (Love Jihad) వ్యవహారం​ వెలుగు చూసింది. హిందువుగా మారినట్టు చిత్రీకరించిన నిందితుడు మహిళను పెళ్లి చేసుకున్నాడు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. హిందువుగా మారినట్టు నటించిన నవాజ్​ అనే వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు. మొదటి రాత్రి రోజే బాధితురాలికి మత్తు మందు ఇచ్చి నరకం చూపించాడు. అనంతరం నలుగురితో అత్యాచారం చేయించి.. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించినట్లు వెల్లడించింది. అనంతరం నవాజ్​ కు మూడో వివాహం అని తెలిసిన బాధిత మహిళ షాక్​ తిన్నది. దీంతో పోలీసులను ఆశ్రయించింది. పెళ్లి చేసుకుని మోసం చేయడంతో పాటు తన ఫ్లాట్​, బంగారంతో పాటు తన పేరుపైన లోన్లు తీసుకుని నవాజ్​ పారిపోయినట్లు మహిళ ఆరోపిస్తోంది. దీంతోపాటు నవాజ్​ ఇతర రాష్ట్రాలకు హవాలా డబ్బులు పంపించేవాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు పెళ్లి చేసుకుని మోసం చేయడంతో పాటు హవాలా డబ్బు వ్యవహారంపై దర్యాప్తు చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>