Mobile Popup Ad
Mobile Popup Ad

కరీంనగర్​ లో మీడియా అకాడమీ చైర్మన్​ పర్యటన

కలం, కరీంనగర్ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి కరీంనగర్ (Karimnagar) జిల్లాలో పర్యటించారు. శుక్రవారం రాత్రి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో కరీంనగర్ (Karimnagar) ఆర్డీవో కే మహేశ్వర్ ఆయనకు సాదర స్వాగతం పలికారు. మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి, వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయు)నాయకులు శ్రీనివాస్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ఆర్డీవో పలు అంశాలపై చర్చించారు. మీడియా అకాడమీ చైర్మన్‌ను కలిసిన వారిలో సమాచార పౌర సంబంధాల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జీ లక్ష్మణ్ కుమార్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజినీర్ ఉషారాణి, సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ గౌడ్, ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యుడు నగునూరి శేఖర్, వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు (ఐజేయూ) గాండ్ల శ్రీనివాస్, జర్నలిస్టు యూనియన్ నాయకులు ఒంటెల కృష్ణ, ఎలగందుల రవీందర్, చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>