కలం, వెబ్ డెస్క్: బీఆర్ ఎస్ నేతలను కల్వకుంట్ల కవిత(Kavitha) టెన్షన్ పెడుతోంది. ఎప్పుడు ఎవరిని టార్గెట్ చేస్తుందో.. ఎవరి బండారం బయటపెడుతుందో అనే గుబులు గులాబీ పార్టీని వెంటాడుతోంది. మొదట్లో హరీష్ రావును మాత్రమే టార్గెట్ చేసిన కవిత రూటు మార్చి ఒక్కో నేతపై సంచలన ఆరోపణలు మొదలు పెట్టింది. సెలెక్టెడ్ గా నేతలను టార్గెట్ చేసుకుంటోంది. బహుషా ఆమెను పార్టీలో ఉన్నప్పుడు ఆమె మాట వినని వారు.. లేదంటే కేటీఆర్ వర్గంలో ఉండి ఆమెను వ్యతిరేకించిన వారు, హరీష్ రావు టీమ్.. వాళ్లే ఇప్పుడు వణికిపోతున్నారు.
బయటి వాళ్లు ఆరోపణలు చేసినా పెద్దగా బలం ఉండదు. కానీ ఇంట్లో మనిషి ఏం చెప్పినా దానికి మంచి ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు కవిత మాటలు కూడా అలాగే తయారయ్యాయి. కవిత(Kavitha) చెప్తోందంటే నిజమే అని అటు ప్రజలు, ఇటు మీడియా నమ్మేస్తారు. అందుకే ఆమె పిడుగు ఎవరి మీద పడుతుందో అనే భయం మొదలైంది. హరీష్ రావును పొట్టు పొట్టు తిట్టి ఆయన మీద లెక్కలేనన్ని ఆరోపణలు చేసింది. ఆ తర్వాత మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిని టార్గెట్ చేసింది. నల్గొండకు వెళ్లి మరీ ఆయన్ను ఏకిపారేసింది. నల్గొండకు జగదీశ్ ఏమీ చేయలేదని.. పలానా అవినీతి పనులన్నీ చేశాడని తిట్టిపోసింది.
ఆ తర్వాత మెదక్ వెళ్లింది. అక్కడ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డిని టార్గెట్ చేసుకుంది. హరీష్ వల్లే ఆమె పార్టీలో ఎదిగిందని.. ఆమెకు పార్టీలో ఉండే అర్హత కూడా లేదన్నది. మెదక్ లో చేసిన అవినీతి పనులను మొత్తం బయట పెట్టింది. నిన్న మేడ్చల్ వెళ్లింది. అక్కడ మాజీ మంత్రి మల్లారెడ్డిని టార్గెట్ చేసింది. డంపింగ్ యార్డును పరిశీలించేందుకు వెళ్లి.. పాలమ్మిండు, పూలమ్మిండు.. వేల ఎకరాలు కబ్జా పెట్టిండు అంటూ సంచలనం రేపింది. నేడు కూకట్ పల్లికి వెళ్లింది. అక్కడ లోకల్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును టార్గెట్ చేసుకుంటున్నట్టు కనిపిస్తోంది.
ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.. కవిత వెళ్తున్న చోట ప్రజెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉంటున్నా సరే వారిని ఏమీ అనట్లేదు. మాజీ బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలను ఏకిపారేస్తోంది. మొదటి నుంచి కవిత తనను అపోజ్ చేసిన బీఆర్ ఎస్ నేతలనే టార్గెట్ గా పెట్టుకుని వెళ్తోంది. ఇప్పటి వరకు ఆమె టార్గెట్ చేసిన వాళ్లలో అయితే కేటీఆర్ వర్గం లేదంటే హరీష్ వర్గం నేతలే ఉంటున్నారు. అందుకే మిగతా నేతల్లో ఒకింత టెన్షన్ స్టార్ట్ అయింది. మిగిలిన వాళ్లలో కేటీఆర్, హరీష్ రావును సపోర్ట్ చేసిన వాళ్లంతా కవిత తమ జిల్లాకు వస్తుందా లేదా ఆరా తీస్తున్నారు. చూస్తుంటే కవిత ఇప్పట్లో ఈ పర్యటనలు ఆపేలా లేదు. మరి నెక్ట్స్ బలయ్యేది ఎవరో చూడాలి.
Read Also: 9-5 IT జాబ్.. ఆమె కల నెరవేర్చింది
Follow Us On: Pinterest


