కోహ్లీ, రోహిత్‌లకు గౌతమ్ గంభీర్(Gautam Gambhir)కు మధ్య చాలాకాలంగా వివాదం నడుస్తోంది. వీరు ఎప్పుడు ఎదురుపడినా ఆ ఫేస్‌ఆఫ్ సంచలనంగా మారుతోంది. ఆఖరికి గంభీర్ కోచింగ్‌లో ఉండటం ఇష్టం లేకనే టీ20, టెస్ట్‌లకు రో-కో రాజీనామా చేశారని కూడా కొందరు అభిప్రాయపడ్డారు. అయితే తాజాగా వీరి వివాదం సమసిపోయిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా గౌతమ్ గంభీర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. భారత్ మూడో వన్డేలో ఆతిథ్య దక్షిణాఫ్రికాను 9 వికెట్ల తేడాతో ఓడించి సిరీస్‌ను 2-1 తేడాతో గెలుచుకోవడంతో, మ్యాచ్ ముగిసిన వెంటనే గంభీర్ విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మల ప్రదర్శనపై స్పందించారు.
“విరాట్(Virat Kohli), రోహిత్ చాలా కాలంగా భారత క్రికెట్ కోసం చేస్తున్నదే చేస్తున్నారు. 50 ఓవర్ల ఫార్మాట్‌లో వారు కీలకమైన ఆటగాళ్లు. భవిష్యత్తులో కూడా అదే స్థాయిలో జట్టుకు సహకారం అందిస్తారని నమ్ముతున్నాను” అని ఆయన మీడియాతో అన్నారు. ఇటీవలి కాలంలో గంభీర్(Gautam Gambhir), కోహ్లీ, రోహిత్‌ల మధ్య విభేదాలు ఉన్నాయన్న వార్తలు వైరల్ కావడంతో, ఈ వ్యాఖ్యలు ఆ ఊహాగానాలకు పూర్తిగా ముగింపు పలికినట్లుగా భావిస్తున్నారు.
2027 ప్రపంచకప్ సమయానికి రోహిత్(Rohit Sharma), కోహ్లీ ఇద్దరూ 40 ఏళ్లకు చేరువ అవుతారు. అయినప్పటికీ వారి ప్రస్తుత ఫామ్ జట్టులో వారి స్థానాన్ని మరింత బలపరుస్తోంది. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో రోహిత్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును గెలుచుకోగా, దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేల్లో రెండు సెంచరీలతో సహా 300కు పైగా పరుగులు చేసిన కోహ్లీ కూడా అదే అవార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ నేపథ్యంలో కోచ్ గంభీర్ చేసిన తాజా వ్యాఖ్యలు, డ్రెస్సింగ్ రూమ్‌లో ఐక్యత సరిగా ఉందని అభిమానులకు స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నాయి.
Read Also: జీలకర్ర నీటితో కొవ్వు కరుగుతుందా? అసలు రహస్యం ఇది..!
Follow Us On: Facebook


