కలం, మణుగూరు: స్థానిక సంస్థల పోలింగ్ సమీపిస్తున్న వేళ మణుగూరులో రాజకీయం వేడెక్కింది. బీఆర్ఎస్ ప్రచార వాహనంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం అంబేద్కర్ సెంటర్‌లో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు (Rega Kantharao) మాట్లాడుతూ.. ఓటమి భయంతోనే కాంగ్రెస్ కార్యకర్తలు మా ప్రచార వాహనంపై దాడి చేసి, ఆటో డ్రైవర్ నజీద్ పాషాని గాయపర్చారన్నారు. సామాగ్రిని ధ్వంసం చేశారని మండిపడ్డారు.
కాంగ్రెస్‌లో వర్గపోరును నియంత్రించలేక, సొంత పంచాయతీని గెలిపించుకోలేక మాపై దాడులు చేస్తున్నారని రేగా కాంతారావు (Rega Kantharao) ఆరోపించారు. బీఆర్ఎస్ అభ్యర్థులకు వస్తున్న ఆదరణను ఓర్వలేక ఎమ్మెల్యేకు ఓటమి భయం పట్టుకుందని, గతంలో కూడా బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి చేశారని ఆయన గుర్తుచేశారు. మాకు చట్టం మీద పూర్తి విశ్వాసం ఉందని, దాడి చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదని రేగా కాంతారావు హెచ్చరించారు.
Read Also: కాజీపేట బ్రిడ్జి.. కట్టేదెన్నడు..?
Follow Us On: Instagram


