epaper
Monday, March 2, 2026
epaper

మక్క పేలాలు, సకినాలు.. గ్లోబల్ సమ్మిట్ గెస్టులకు స్పెషల్ గిఫ్ట్స్

కలం, వెబ్‌డెస్స్ : తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా గ్లోబల్ సమ్మిట్ (Telangana Global Summit-2025) ను నిర్వహిస్తోంది. 8, 9 తేదీల్లో భారత ఫ్యూచర్ సిటీలో జరిగే ఈ సదస్సుకు ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఈ సదస్సుకు 44 దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నారు. సుమారు 2వేల మంది దేశ, విదేశీ అతిథులు పాల్గొంటారు. డెలిగేట్లకు తెలంగాణ పర్యటన ఎప్పటికీ గుర్తుండిపోయేలా ప్రత్యేక సావనీర్ బహుమతిని ప్రభుత్వం అందించనుంది.

వీటిలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లోగో‌తో పాటు, పోచంపల్లి ఇక్కత్ శాలువా, చేర్యాల కళాకృతులు, హైదరాబాదీ అత్తర్, ముత్యాలతో కూడిన నగలను ఈ సావనీర్‌లో పొందుపరుస్తారు. అలాగే తెలంగాణకే ప్రత్యేకమైన వంటలైన ఇప్పపువ్వు లడ్డు, సకినాలు, చెక్కలు, బాదం కీ జాలి, నువ్వుల ఉండలు, మక్క పేలాలతో కూడిన మరోప్రత్యేక బాస్కెట్ ను కూడా అతిథులకు అందించనున్నారు.

గవర్నర్ జిష్ణు దేవ్‌వర్మ గ్లోబల్ సమ్మిట్ (Global Summit) ను లాంఛనంగా ప్రారంభిస్తారు. సదస్సులో నోబెల్ అవార్డు గ్రహీత అభిజిత్ బెనర్జీ, కైలాష్ సత్యార్థి, ట్రంప్ మీడియా టెక్నాలజీ గ్రూప్ సీఈవో ఎరిక్ స్వైడర్, వరల్డ్ ఎకానమిక్ ఫోరమ్ సీఈవో జెరేమీ జుర్గెన్స్, బయోకాన్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్ పర్సన్ కిరణ్ మజుందార్-షాతో పాలు పలువురు ప్రసంగిస్తారు. అనంతరం రెండన్నర గంటలకు సీఎం రేవంత్ రెడ్డి పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వ సహకారం, విజన్ డాక్యుమెంట్ 2047 లక్ష్యాలు వివరిస్తారు.

వచ్చిన అంతర్జాతీయ, దేశీయ అతిధులు, పెట్టుబడిదారులకు తెలంగాణతో పాటు హైదరాబాద్ ప్రత్యేకతలు తెలిసేలా ప్రచార సామాగ్రిని సిద్దం చేశారు. ఎయిర్ పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీలో వేదిక వరకు వివిధ రూపాల్లో వీటి ప్రదర్శన ఉంటుంది. అలాగే హైదరాబాద్ వ్యాప్తంగా అత్యాధునిక టెక్నాలజీ తో ప్రత్యేకంగా ప్రచార ఏర్పాట్లు చేశారు. లైటింగ్ ప్రొజెక్షన్, 3D ప్రాజెక్షన్ మ్యాపింగ్, ఎయిర్ పోర్టు అప్రోచ్ రోడ్ లో ఎల్ఈడీ స్క్రీన్స్ తో ఈ విభిన్న ప్రదర్శనలు ఉంటాయి.

మరోవైపు నాగార్జున సాగర్ దగ్గర ఉన్న ప్రపంచంలోని వారసత్వ బౌద్ధ థీమ్ పార్కు అయిన బుద్ధవనం పర్యటనకు దౌత్య బృందం వెళ్లేలా టూరిజం శాఖ ప్రత్యేక ఏర్పాట్లు సిద్ధం చేసింది. సదస్సు జరిగే రెండు రోజుల పాటు హాజరైన అందరికీ పసందైన హైదరాబాదీ బిర్యానీతో పాటు, తెలంగాణ ప్రసిద్ద వంటలతో భోజనాలను అందించేందుకు వంటశాలలు సిద్దం చేశారు.

Read Also: హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ రోడ్డుకు ట్రంప్ పేరు

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!