కలం, వెబ్‌డెస్క్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి కావస్తున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రజా పాలన విజయోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. రెండేళ్ల క్రితం నాకు ఆ ధైర్యం ఇచ్చి.. తమ ఓటుతో గెలుపు సంకల్పాన్ని ఇచ్చి.. నిండు మనస్సుతో ఆశీర్వదించిన తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ పోస్టులో రాసుకొచ్చారు.
ఈ రెండేళ్లలో తెలంగాణను శిఖరాగ్రాన నిలిపేందుకు తపనతో శ్రమించానన్నారు. గత పాలన శిథిలాల కింద కొన ఊపిరితో ఉన్న నవతరానికి కొలువుల జాతరతో కొత్త ఊపిరి పోశామని తెలిపారు. రైతుకు దన్నుగా నిలిచి దేశానికే ఆదర్శంగా నిలిపామన్నారు. ఆడబిడ్డలకు ఆర్థిక మద్ధతు ఇచ్చి అదానీ, అంబానీలలా వ్యాపారరంగంలో నిలిపామని చెప్పారు. బలహీనవర్గాల వందేళ్ల ఆకాంక్షలను కుల గణనతో కొత్త మలుపులు తిప్పినట్లు తెలిపారు. ఎస్సీ వర్గీకరణతో మాదిగ సోదరుల ఉద్యమానికి నిజమైన సార్థకత చేశామని రేవంత్ రెడ్డి (Revanth Reddy) వెల్లడించారు.
చదువొక్కటే బతుకు తెరువుకు బ్రహ్మాస్త్రం అని నమ్మి… యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్లు, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీకి శ్రీకారం చుట్టామన్నారు. అందెశ్రీ రాసిన “జయ జయహే తెలంగాణ”కు అధికారిక గుర్తింపు ఇచ్చినట్లు పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచాయన్నారు. 2047 నాటికి తెలంగాణ రాష్ట్రం ఎలా.. ఎక్కడ ఉండాలనే ఆలోచనతో మార్గదర్వక పత్రం సిద్ధం చేశామన్నారు. గత పాలకులు కలలో కూడా ఊహించని విధంగా ప్రపంచ వేదిక పై #TelanganaRising రీ సౌండ్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సీఎం తెలిపారు.
భారత దేశ గ్రోత్ ఇంజిన్ గా తెలంగాణను మార్చడానికి సర్వం సిద్ధం చేసినట్లు ప్రకటించారు. భారత్ ఫ్యూచర్ సిటీ రేపటి తెలంగాణ ప్రగతికి వేగుచుక్కగా మారనుందని ధీమా వ్యక్తం చేశారు. నిన్నటి వరకు ఒక లెక్క.. రేపటి “తెలంగాణ గ్లోబల్ సమ్మిట్” తర్వాత మరో లెక్క అని పేర్కొన్నారు. తెలంగాణ తనకు తోడుగా ఉన్నంత వరకు.. ఈ గొంతులో ఊపిరి ఉన్నంత కాలం.. “TELANGANA RISING” కు తిరుగు లేదు అని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
Read Also: రంగనాయకసాగర్‌లో ఎత్తేస్తా.. రేవంత్‌పై హరీశ్ ఆగ్రహం
Follow Us On: Facebook


