Mobile Popup Ad
Mobile Popup Ad

మండలి నుంచి బీఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్

కలం, వెబ్ డెస్క్: బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శాసనమండలిలో సోమవారం సభా కార్యక్రమాలు ప్రారంభమైనప్పటి నుంచీ బీఆర్ఎస్ సభ్యులు నిరసనలు (BRS MLCs Protest) మొదలుపెట్టారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబానికి చెందిన అక్రమ మైనింగ్ వ్యవహారంపై సభా సంఘాన్ని వేయాలని బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేశారు. చైర్మన్ పోడియం దగ్గరకు వచ్చి నిరసనలు తెలిపారు. ఇప్పటికే సీబీసీఐడీ ఎంక్వయిరీ జరిపిస్తామంటూ స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటన చేశారని శాసన వ్యవహారాల మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు వివరించారు. అయినా బీఆర్ఎస్ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తుండడంతో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మధుసూదనాచారి చొరవ తీసుకుని బీఆర్ఎస్ సభ్యులను నియంత్రించాల్సిందిగా చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి పలుమార్లు విజ్ఞప్తి చేశారు. సభా కార్యక్రమాలకు అంతరాయం కలుగుతుండడంతో శాసన వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు ప్రతిపాదన మేరకు బీఆర్ఎస్ సభ్యులను ఈ రోజు మొత్తం కార్యక్రమాల్లో హాజరు కాకుండా అందరినీ సస్పెండ్ చేస్తున్నట్లు చైర్మన్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) ప్రకటించారు.

అటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని, రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ అక్రమాలపై హౌజ్ కమిటీ వేయాలని, హైకోర్టు సిట్టింగ్ జడ్జ్‌లతో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టారు. తెలంగాణ ప్రజలను రేవంత్ సర్కార్ మోసం చేస్తోందని ఆరోపించారు. మైనింగ్ శాఖలో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని, అయినా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పొంగులేటి నైతిక బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మార్షల్స్‌ను అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూడటం సరికాదనిఫైర్ అయ్యారు.

సస్పెన్షన్‌కు గురైన ఎమ్మెల్సీలు వీరే :

1. మధుసూధనాచారి
2. తక్కెళ్లపల్లి రవీందర్ రావు
3. దేశపతి శ్రీనివాస్
4. ఎల్ రమణ
5. వంటేరు యాదవరెడ్డి
6. సుంకరి రాజు
7. నవీన్ కుమార్ రెడ్డి
8. తాతా మదుసూదన్
9. వాణిదేవి
10. పోచంపల్లి శ్రీనివాసరెడ్డి
11. కోటిరెడ్డి

Read Also:  భార‌త్‌లో చైనా CCTV కెమెరాల‌పై నిషేధం.. ఎందుకంటే?

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>