కలం, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy)కి వ్యతిరేకంగా పోస్టర్లు.. అది కూడా గాంధీభవన్ వద్ద వెలవడం గమనార్హం. రేవంత్ రెడ్డి ఓ వైపు గ్లోబల్ సమ్మిట్ పేరుతో వరల్డ్ బిజినెస్ లీడర్లను, ప్రధానమంత్రి, ఇతర రాష్ట్రాల సీఎంలను ఆహ్వానించారు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచే ఉద్దేశంతో, లక్షల కోట్ల పెట్టుబడల కోసం దీన్ని నిర్వహిస్తున్నారు. ఇంత పెద్ద ఈవెంట్ జరుగుతున్న టైమ్ లో అదికూడా గాంధీ భవన్(Gandhi Bhavan) వద్ద కొన్ని పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. ఇందులో వారణాసి సినిమాలో పృథ్వీరాజ్ పోస్టర్ ను కాపీ కొట్టి అందులో రేవంత్ ఫేస్ ను డిజైన్ చేశారు.
కుర్చీలో రేవంత్ రెడ్డి (Revanth Reddy) కూర్చుంటే వెనకాల ఉన్న రోబో హ్యాండ్స్ లో కాంగ్రెస్ ఎగ్గొట్టిన హామాలు ఇవే అంటూ అందులో రాసుకొచ్చారు. రెండేళ్ల పాలనలో రేవంత్ రెడ్డి డ్యూటీ రిపోర్ట్ అంటూ ఆ పోస్టర్ లో రాసి ఉంది. యువ వికాసంతో రూ.5లక్షలు అందక యువత ఆగమైపోతందని మరో పోస్టర్ అంటించారు. ఈ పోస్టర్లపై కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. కక్షపూరితంగానే ఇలాంటి పోస్టర్లు అంటిస్తున్నారని.. తాము ఇలాంటి చిల్లర రాజకీయాలు ఎన్నడూ చేయలేదంటున్నారు. గ్లోబల్ సమ్మిట్ తో సీఎం రేవంత్ కు పేరొస్తుందనే ఉద్దేశంతోనే ప్రతిపక్షాలు ఇలా చేస్తున్నాయంటున్నారు.
Read Also: ఎగరని ఇండిగో.. దేశ వ్యాప్తంగా వందల ఫ్లైట్లు రద్దు
Follow Us on: Youtube


