కలం, వెబ్ డెస్క్: ఏపీలో స్క్రబ్ టైఫస్(Scrub Typhus) కేసులు కలకలం రేపుతున్నాయి. గడిచిన రెండు రోజుల్లో చిత్తూరు జిల్లా 157 పాజిటివ్ కేసులతో రాష్ట్రంలో అత్యధికంగా ఉంది. కాకినాడ, విశాఖపట్నం జిల్లాల్లో 270 కేసులున్నాయి. అధికారిక సమాచారం ప్రకారం.. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు 5 వేలకుపైగా నమూనాలను పరీక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 800 వరకు నమోదైనట్టు తెలుస్తోంది. పల్నాడులో ఇద్దరు, బాపట్ల, నెల్లూరు, విజయనగరంలో ఒక్కొక్కరు మరణించారు. ఆదివారం కృష్ణా జిల్లాలో మరో వ్యక్తి స్క్రబ్ టైఫస్‌తో మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 5కు చేరింది.
కేసులు రోజురోజుకూ పెరిగిపోతుండటంతో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. స్క్రబ్ టైఫస్(Scrub Typhus) కేసుల పరీక్షల కోసం అన్నిరకాల సదుపాయాలను కల్పించింది. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సుమారు 1.07 కోట్ల అజిత్రోమైసిన్ IP 500 mg, 98.75 లక్షల డాక్సిసైక్లిన్ HCL IP 100 mg మందులను అందుబాటులో ఉంచాయి.
స్క్రబ్ టైఫస్ ఎలా వస్తుంది?
పొదలు, గడ్డి, అటవీ ప్రాంతాల్లో పురుగుల కాటు ద్వారా వ్యాధి వస్తుంది. పొల్లాలో బయటి ఎక్కువసేపు ఉండేవారికి ప్రమాదం ఎక్కువ.
లక్షణాలివే..
ఆకస్మిక జ్వరం
తలనొప్పి
శరీర నొప్పులు, అలసట
దగ్గు
6 నుంచి 21 రోజుల్లో లక్షణాలు కనిపిస్తాయి
Read Also: సింహాద్రి అప్పన్న సేవలో విరాట్ కోహ్లీ
Follow Us On: Pinterest


