కలం, వెబ్ డెస్క్: ఇండిగో సంక్షోభం (Indigo Crisis) ఆదివారం కూడా కొనసాగుతోంది. దేశ వ్యాప్తంగా అన్ని ఎయిర్ పోర్టుల్లో ఫ్లైట్లు రద్దవుతున్నాయి. ఈ రోజు 1500 వరకు ఫ్లైట్లు నడుపుతామని ఇండిగో చెప్పినా ఆ స్థాయిలో రిజల్ట్ కనిపించట్లేదు. నేడు హైదరాబాద్ లోనే వందకు పైగా ఫ్లైట్లు క్యాన్సిల్ అయ్యాయి. బెంగుళూరులో 156, ఢిల్లీలో 177 ఫ్లైట్లకు పైగా క్యాన్సిల్ అవుతున్నాయి. ఇండిగో మాతృసంస్థ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ ఈ క్రైసిస్ ను క్లియర్ చేయడానికి రంగంలోకి దిగింది. స్పెషల్ టీమ్స్ ఏర్పాట్లు చేసి ప్లానింగ్ రెడీ చేస్తోంది. కానీ చూస్తుంటే ఇప్పట్లో ఈ ప్రాబ్లమ్ క్లియర్ అయ్యేలా కనిపించట్లేదు.
అటు డీజీసీఏ కొత్త ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ లో ఇండిగోకు సవరించినా సరే ఈ ప్రాబ్లమ్ క్లియర్ కావట్లేదు. ఇండిగో తీసుకున్న చెత్త నిర్ణయాలతోనే ఇండిగో సంక్షోభం (Indigo Crisis) ఎదుర్కోవాల్సి వచ్చిందని ప్రచారం ఉంది. తక్కువ పైలట్లు, ఒకే ఫ్లైట్ తో ఎక్కువ ల్యాండింగ్స్, డబ్బుల కోసం నైట్ టైమ్ ఎక్కువ ల్యాండింగ్స్ లాంటివి చేయడం వల్ల కొత్త రూల్స్ వచ్చి ఇబ్బందులు అవుతున్నాయి. ఏడాది కింద నుంచే ఈ కొత్త రూల్స్ ఉంటాయని అన్ని సంస్థలకు తెలుసు. కానీ వాటికి తగ్గట్టు ఇండిగో ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు, చర్యలు తీసుకోలేదు. ఎక్కువ మంది పైలట్లను రిక్రూట్ చేసుకోకుండా ఇలా ప్రయాణికులను ఇబ్బందులు పెడుతోంది.
Read Also: ఇక్కడితో ముగిద్దాం.. పెళ్లిపై స్మృతి, పలాష్ ప్రకటన
Follow Us On: Instagram


