కలం, వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కి ఒక గ్రేస్ ఉంది. ఆయన సినిమాలు అంటే ఈ టైమ్ లో కచ్చితంగా ఒక మెసేజ్ ఓరియెంటెడ్ లాగే ఉండాలి. అంతే గానీ.. కుర్ర హీరోల లాగా హీరోయిన్లతో రొమాన్సులు, లవ్ సాంగ్స్ అంటే ప్రేక్షకులు యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే చిరు వయసు ఆ స్థాయిని ఎప్పుడో దాటిపోయింది. కాబట్టి ఈ ఏజ్ లో ఆయనతో లవ్ సాంగ్స్ డ్యూయెట్లు ఎక్కువగా చేయిస్తే డేంజరే. కానీ అనిల్ రావిపూడి(Anil Ravipudi) ఇలాంటి సాంగ్స్ ఎందుకు పెడుతున్నాడో అర్థం కావట్లేదు. అనిల్ డైరెక్ట్ చేస్తున్న మన శంకర వర ప్రసాద్ గారు సినిమా నుంచి వరుసగా సాంగ్స్ రిలీజ్ అవుతున్నాయి. మొన్న మీసాల పిల్ల సాంగ్ రిలీజ్ అయితే దానికి భారీగా వ్యూస్ వచ్చాయి.
ఇప్పుడు శశిరేఖా సాంగ్ రిలీజ్ అయింది. ఈ సాంగ్ చూసిన వారికి చిరంజీవి (Chiranjeevi) తో ఇవేం ప్రయోగాలు అనిపించక మానదు. ఎందుకంటే ఇది కూడా లవ్ సాంగ్. చిరంజీవి నుంచి ఈ ఏజ్ లో ఇలాంటి సాంగ్స్ ప్రేక్షకులు ఎక్స్ పెక్ట్ చేయట్లేదు. అనిల్ సినిమాల్లో పెద్దగా మెసేజ్ ఓరియెంటెడ్ ఏమీ ఉండవు. కేవలం ఫన్ అండ్ చిల్ మోడ్ లోనే ఆయన మూవీలుంటాయి.
కానీ చిరు స్థాయిని దృష్టిలో పెట్టుకుని ఆయనకు తగ్గట్టు సీన్లు, సాంగ్స్ పెడితే బాగుంటుందని అంటున్నారు మెగా అభిమానులు. అంతేగానీ చిరంజీవిని ఏదో కుర్ర హీరోలాగా లవ్ సాంగ్స్ కు పరిమితం చేస్తే ఆయన ఇమేజ్ కు మంచిది కాదంటున్నారు. ఆయనకు ఉన్న క్రేజ్ దృష్ట్యా మంచి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తేనే బెటర్ అని సూచిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమాల్లో కూడా చిరును హద్దులు దాటేసి చూపించొద్దని కోరుతున్నారు.
Read Also: సింహాద్రి అప్పన్న సేవలో విరాట్ కోహ్లీ
Follow Us On: Facebook


