కలం డెస్క్ : కాకినాడ జిల్లా సామర్లకోట మండలపరిధిలో దారుణం చోటుచేసుకుంది. చిన్నప్పటి నుంచి ప్రేమిస్తున్నానని వెంటపడిన యువకుడు.. దీప్తి అనే బాలికను బ్లేడుతో గొంతుకోసి హత్య చేశాడు. ఆపై తాను రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ హత్య, ఆత్మహత్యకు దారితీసి కారణాలు ఏంటి? అనే అంశంపై క్లారిటీ రాలేదు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పనసపాడులోని గాడేరు కాలువ గట్టు దగ్గర బాలిక మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు అదే విధ:గా హుస్సేన్‌పురం సమీపంలో రైలు కిందపడి యువకుడా ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం రావడంతో అక్కడకు వెళ్లీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వారి దర్యాప్తులో ఈ రెండు ఘటనలు ఒకే అంశానికి చెందినవని తేలింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గొల్లప్రోలు మండలం దుర్గాడకు చెందిన జీ దీప్తి(17).. కాకినాడలో ఇంటర్‌మీడియట్ చదువుతోంది. అదే గ్రామానికి చెందిన కే అశోక్(19).. ఆమెను చిన్నప్పటి నుంచి ప్రేమిస్తున్నాని చెప్పుకునేవాడు. రెండు రోజుల క్రితం దీప్తి.. కాకినాడలోని బంధువుల ఇంటికి వెళ్లింది. మంగళవారం అశోక్.. బాలికను పనసపాడులోని గాడేరు కాలువగట్టు దగ్గరకు తీసుకెళ్లాడు. అక్కడే ఆమె గొంతును బ్లేడుతో కోసి హత్య చేశాు. అక్కడి నుంచి హుస్సేన్‌పురం సమీపంలో రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాలను గుర్తించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వారి దర్యాప్తులో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అసలు అశోక్ అలా చేయడానికి కారణాలు ఏంటి? అనే కోణంలో దర్యాప్తును ముందుకు సాగిస్తున్నట్లు సీఐ కృష్ణభగవాన్ తెలిపారు.

