epaper
Friday, January 16, 2026
spot_img
epaper

హైదరాబాద్‌లో దారుణం.. యువతి ఆత్మహత్య

కలం డెస్క్ : హైదరాబాద్‌ రాజేంద్రనగర్ పోలీస్టేషన్ పరిధిలో ఓ యువతి అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. పడకగదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారం.. హైదర్‌గూడ ప్రాంతానికి చెందిన రమేష్ అనే వ్యక్తి కుమార్తె ఇషిక.. బుధవారం ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లింది. అక్కడే ఓ ప్రముఖ సంస్థలో ఉద్యోగం చేస్తోంది.

జూన్ చివరి వారంలో తల్లిదండ్రి దగ్గరకని హైదరాబాద్ రాజేంద్రనగర్‌కు వచ్చింది. కాగా అప్పటి నుంచి ఇక్కడి నుంచే వర్క్ ఫ్రం హోం పద్దతిలో ఇషిక.. పనిచేసుకుంటోంది. బుధవారం మధ్యాహ్నం నుంచి ఇషిక తన గది నుంచి బయటకు రాకపోవడంతో ఆమె తల్లి.. సాయంత్రం 7 గంటల సమయంలో బెడ్‌రూమ్ దగ్గరకు వెళ్లి చూడగా.. ఇషిక ఉరేసుకుని కనిపించింది. కాగా ఆమె ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి? ఒక్కసారిగా అమెరికా నుంచి ఇక్కడే ఉండటానికి ఆమె ఆత్మహత్యకు ఏమైనా సంబంధం ఉందా? వంటి కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం బుధవారం అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>