Mobile Popup Ad
Mobile Popup Ad

అమెరికా – ఇరాన్ వార్.. పాక్ పై జైశంకర్ ఘాటు వ్యాఖ్యలు!

కలం, వెబ్ డెస్క్ : అమెరికా, ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్దం ( US – Iran Conflict) వేళ భారత ప్రభుత్వం పాకిస్థాన్ పై తీవ్ర విమర్శలు చేసింది. పశ్చిమాసియా సంక్షోభంపై బుధవారం పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా అమెరికా – ఇరాన్ దేశాల మధ్య పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహిస్తుంది అని వస్తున్న వార్తలను విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ (EAM S. Jaishankar) తీవ్రంగా ఖండించారు. పాకిస్తాన్ మాదిరిగా భారతదేశంగా బ్రోకర్ దేశంగా ఉండబోదని స్పష్టం చేశారు. పాక్ మధ్యవర్తిత్వ ప్రయత్నాల్లో కొత్తేమీ లేదని.. 1981 నుంచి అమెరికాను పాక్ వాడుకుంటుందని జై శంకర్ (Jaishankar) ఆరోపించారు.

కాగా, మధ్యప్రాశ్చ్యంలో మారుతున్న పరిస్థితులపై భారత వైఖరిని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. గంటన్నరకు పైగా జరిగిన ఈ మీటింగ్ లో పలు కీలక అంశాలపై చర్చించారు. అఖిలపక్ష సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సందేశం పంపారని ప్రభుత్వం వెల్లడించింది. దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తలు త్వరగా ముగియాలని మోడీ ఆకాంక్షించారు. పశ్చిమాసియా సంక్షోభంపై భారతప్రభుత్వం మౌనం వహించిందన్న ప్రతిపక్షాల ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>