epaper
Tuesday, November 18, 2025
epaper

బైక్, కార్ల బంపర్ సేల్స్.. జీఎస్టీ 2.0 ఎఫెక్ట్

కలం డెస్క్ : బిహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ 2.0 సంస్కరణల(GST Reforms) పేరుతో పలు వస్తువులపై పన్ను తగ్గించడం లేదా పూర్తిగా ఎత్తివేయడంతో కొనుగోళ్ళు గణనీయంగా పెరిగాయి. అందులో భాగంగానే దేశవ్యప్తంగా మీడియం కార్లు, మోటారు సైకిళ్ళ సేల్స్ పీక్‌కు చేరుకున్నాయి. హీరో, హోండా, టీవీఎస్, బజాజ్, ఎన్‌ఫీల్డ్, సుజుకీ తదితర కంపెనీలకు చెందిన బైక్‌లు గతేడాది సెప్టెంబరు చివరి నాటికి (పన్నెండు నెలల వ్యవధిలో) 18.67 లక్షల యూనిట్లు విక్రయమైతే జీఎస్టీ తగ్గింపుతో ఈ ఏడాది సెప్టెంబరు చివరి నాటికి (జీఎస్టీ 2.0 అమల్లోకి వచ్చిన తర్వాత) దాదాపు రెండు లక్షల యూనిట్లు పెరిగి 20.60 లక్షలకు చేరుకున్నది. మీడియం రేంజ్ కార్ల విక్రయాలు సైతం గతేడాది సెప్టెంబరులో అన్ని కంపెనీలకు చెందినవి 3.20 లక్షల యూనిట్ల సేల్స్ నమోదైతే ఈ ఏడాది సెప్టెంబరులో మాత్రం 3.80 లక్షలకు పెరిగింది.

పోటీ పడుతున్న కంపెనీలు :

జీఎస్టీ 2.0 సంస్కరణలతో శ్లాబ్‌లో మార్పులు చేసి పన్నులను కేంద్రం తగ్గించడంతో విక్రయాలను పెంచుకునేందుకు మారుతి, హ్యుండయ్, టాటా, మహింద్ర, టొయోటా, స్కోడా, ఎంజీ తదితర కార్ల తయారీ కంపెనీలు పోటీ పడుతున్నాయి. బైక్ తయారీ కంపెనీలైన హీరో, హోండా, టీవీఎస్, బజాజ్, సుజుకి లాంటివి కూడా రేట్లు తగ్గించినట్లు వినియోగదారులకు వాణిజ్య ప్రకటనల ద్వారా గాలం వస్తున్నారు. కొన్ని కంపెనీలు ఆఫర్‌లను కూడా ప్రకటిస్తున్నాయి. వినియోగదారులను ఆకట్టుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నాయి. బైక్ కంపెనీల సేల్స్ గతేడాది సెప్టెంబరుతో పోలిస్తే ఈ సంవత్సరం ఏ మేరకు పెరిగిందీ వాణిజ్య, పరిశ్రమల శాఖ వర్గాల ద్వారా గణాంకాలు వెలుగులోకి వచ్చాయి.

హీరో – 6,47,582 (ఈ సెప్టెంబర్) – 6,16,706 (గత సెప్టెంబర్)
హోండా – 5,05,693 – 5,36,391
టీవీఎస్ – 4,13,279 – 3,69,138
బజాజ్ 2,73,188 – 2,59,333
రాయల్ ఎన్‌ఫీల్డ్ – – 1,13,573 – 79,325
సుజుకి – 1,05,886 – 77,263

కార్ల విక్రయాల్లో పెరుగుదల :

మారుతి – 1,44,962 9.1%
టాటా మోటార్స్ – 59,667 – 45.3%
మహింద్రా – 56,233 – 10.1%
హ్యుండయ్ – 51,547 – 0.9%
టొయోటా – 27,089 – 13.8%
ఎంజీ మోటార్స్ – 6,728 – 34%
స్కోడా – 6,636 – 101%

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>