epaper
Friday, January 16, 2026
spot_img
epaper

ఆహా ఏమి రుచి.. పుతిన్‌ మెచ్చిన భారతీయ వంటకాలివే!

కలం, వెబ్ డెస్క్ : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన (Putin India Tour)కు వచ్చిన విషయం తెలిసిందే. పుతిన్ భారత పర్యటన ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది. నాటి నెహ్రూ నుంచి నేటి మోడీ వరకు రష్యాతో భారత్‌కు మంచి సంబంధాలున్నాయి. అందుకే పుతిన్ పర్యటనకు ప్రత్యేకత ఏర్పడింది. భారత ప్రధాని మోడీ కూడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా  భారీ స్థాయిలో ఏర్పాటుచేశారు.

పుతిన్ భారత పర్యటన (Putin India Tour)లో ఏయే వంటకాలను ఇష్టంగా తిన్నారు? మోడీ ఎలాంటి మెనూ ఆఫర్ చేశారు? అనేది ఆసక్తిగా మారింది. రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రష్యా అధ్యక్షుడికి ఆతిథ్యం ఇచ్చారు. పుతిన్ పూర్తిగా శాకాహారం తీసుకున్నారు. సౌత్ ఇండియా తాలీ(South India Thali) తిన్నారు. ప్రత్యేకంగా తయారు చేసిన మురంగెలాయ్ చారును రుచి చూశారు. కాష్మీరి వాల్‌నట్ చట్నిని కూడా తిన్నారు. పుదీనా సాస్, షీర్మల్‌తో కాలే చనే కే శికంపురి కబాబ్‌లు, పెల్మేని- కూరగాయల జోల్ మోమోలు, పాలక్ మేథీ మట్టర్ కా సాగ్, తందూరి భర్వాన్ ఆలూ, అచారీ బైంగన్, యెల్లో దాల్ తడ్కా మెనూలో ఉన్నాయి. అలాగే డ్రై ఫ్రూట్, కేసరీ పులావ్, మిల్లీ రోటి, బిస్క్యూట్ రోటి ఉన్నాయి. అలాగే పుతిన్ తాజా పండ్ల రసాలు కూడా తీసుకున్నారు. వాటిలో అల్లం జ్యూస్, దానిమ్మ, ఆరెంజ్, క్యారెట్ కూడా ఉన్నాయి.

భోజనం అనంతరం పుతిన్ భారతీయ కళలను తిలకించారు. నావల్ బ్యాండ్ సరోద్, సారంగి, తబలా కళాకారులు ప్రదర్శించిన “మెస్సినల్ లవ్” అనే ప్రత్యేక ఇండో-రష్యన్ సంగీత కార్యక్రమాన్ని తిలకించారు. ‘అమృతవర్షిణి’, ‘ఖమాజ్’, ‘యమన్’, ‘శివరంజిని’, ‘నలినకాంతి’, ‘భైరవి’ ‘దేశ్’ వంటి భారతీయ రాగాలకు ఆయన మైమరిచిపోయారు.

Read Also: తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిన ‘మహింద్రా’

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>