టీమిండియా స్టార్ బ్యాటర్స్ రోహిత్ శర్మ, కోహ్లీతో పెట్టుకుంటే అంతే సంగతులని భారత మాజీ కోచ్ రవిశాస్త్రి(Ravi Shastri) హెచ్చరించారు. వారి విషయంలో సెలక్టర్లు, కోచ్ ఆచితూచి అడుగులు వేయాలన్నారు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో రోహిత్(Rohit Sharma), కోహ్లీ(Virat Kohli) ఇద్దరూ అదరగొడుతున్నారు. కోహ్లీ.. రెండు వన్డేల్లోనూ సెంచరీలతో మెరిశాడు. ఈ క్రమంలో రోహిత్, కోహ్లీ.. 2027 ప్రపంచకప్‌లో ఆడతారా? లేదా? అన్న చర్చలు తీవ్రంగా జరుగుతున్నాయి. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డేల్లో వాళ్ల ఆటతీరు చూశాక.. వారిని పక్కన పెట్టడం అంత ఈజీ కాదన్న అభిప్రాయం ఏర్పడుతోంది. అయితే ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్(Gautam Gambhir) అలాగే చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్(Ajit Agarkar)తో వీరిద్దరి మధ్య అంతర్గత విభేదాలు ఉన్నాయన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు.
“కోహ్లి రోహిత్‌లను పెట్టుకోవడం అంటే కొరివితో తల గోక్కోవడం లాంటిదే. వాళ్లిద్దరూ చిన్నపిల్లలు కాదు. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో మహా అనుభవం ఉన్న ఆటగాళ్లు. వైట్‌బాల్ క్రికెట్‌లో వీళ్లు లెజెండ్స్. వ్యక్తిగత అజెండాలు వాళ్లమీద ప్రయోగించొద్దు. వాళ్లకు చిర్రెత్తుకొస్తే ఎవరికీ మంచిది కాదు,” అని శాస్త్రి(Ravi Shastri) ఇంటర్వ్యూలో హెచ్చరించాడు. అనుభవానికి ప్రత్యామ్నాయం లేదని రవిశాస్త్రి చెప్పాడు. “ఒకరు ఛేదనలో ప్రపంచంలో బెస్ట్. ఇంకొకరు వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్‌మన్. ఇలాంటి ఆటగాళ్లను జట్టులో ఉంచడం అదనపు ఆప్షన్ కాదు, జట్టుకు అవసరం,” అని ఆయన వివరించాడు. కోహ్లి, రోహిత్ భవిష్యత్ పాత్రపై బీసీసీఐ(BCCI) ఇంకా నిర్ణయం ప్రకటించకపోయినా, రవిశాస్త్రి వ్యాఖ్యలు చర్చను మరింత వేడి చేశాయి.
Read Also: గ్లోబల్ సమ్మిట్‌కు కాంగ్రెస్ ఎంపీలూ దూరం !
Follow Us On: X(Twitter)


