దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో(Indigo) తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరుసగా విమానాలు రద్దవుతుండటంతో జనాలు రాకపోకలు కొనసాగించలేకపోతున్నారు. దీంతో గత్యంతరం లేక రైళ్లు, బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఇండిగో కారణంగా ఇతర విమాన పోటీ సంస్థలు ఒక్కసారిగా రేట్లు పెంచేశాయి. కేవలం హైదరాబాద్ నుంచి ముంబైకు వెళ్లాలంటే రూ.40వేలకు ధర ఉందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అయితే ప్రస్తుత పరిస్థితులపై ఇండిగో(Indigo) విమాన చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. ఈ మేరకు సారీ కస్టమర్స్ అంటూ ట్విట్టర్ లో ఒక వివరణ పత్రం విడుదల చేసింది.తమ సంస్థ యాజమాన్యం ఉద్యోగులు అందరూ అంకిత భావంతో సమస్యలను అధిగమించడానికి కృషి చేస్తున్నామని పేర్కొంది. కేంద్ర విమానయాన శాఖ అధికారులు డిజిసీఏ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని.. త్వరలోనే అన్నీ పరిష్కారం అవుతాయని వెల్లడించింది. విమాన సేవలు పునరుద్ధరిస్తామని.. బుకింగ్ టికెట్ డబ్బులు నూటికి నూరు శాతం వాపసు చేస్తామని ప్రకటించింది. నేటి నుండి పది రోజులపాటు.. ప్రయాణాలు మార్చుకోవాలని విజ్ఞప్తి చేస్తూ వివరణ పత్రంలో ఇండిగో యాజమాన్యం పేర్కొంది.
Read Also: గ్లోబల్ సమ్మిట్ లో కాంతార అట్రాక్షన్
Follow Us On: Pinterest


