కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్(Global Summit) కు నేషనల్ వైడ్ క్రేజ్ తీసుకొస్తున్నారు. ప్రధాని మోడీతో సహా పలు రాష్ట్రాల సీఎంలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సెలబ్రిటీ అట్రాక్షన్ తెచ్చేందుకు కాంతార హీరో రిషబ్ శెట్టిని(Rishab Shetty) ఆహ్వానించారు. కాంతార రెండు పార్టులతో పాన్ ఇండియా వైడ్ గా భారీ క్రేజ్ సంపాదించాడు రిషబ్ శెట్టి. ప్రజెంట్ జై హనుమాన్ సినిమాలోనూ నటిస్తున్నాడు. కాబట్టి అతని క్రేజ్ ను వాడుకోబోతోంది తెలంగాణ ప్రభుత్వం. అటు పీవీ సింధును కూడా రాబోతున్నారు. వీరితో పాటు ఎరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియాకు చెందిన సతీష్ రెడ్డి, కిరణ్ మజుందార్, రితేష్ దేశ్ ముఖ్, అరవింద్ సుబ్రహ్మణ్యన్, రజత్ గుప్తా, నీతి అయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యంతో పాటు మరింత మందిని ఆహ్వానిస్తున్నారు.
Read Also: తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్
Follow Us On: X(Twitter)


