ప్రభాస్ పక్కన ప్రియాంక చోప్రా నటిస్తోందని తెలుస్తోంది. ప్రభాస్ మోస్ట్ వెయిటెడ్ మూవీల్లో కల్కి-2 (Kalki 2) కూడా ఒకటి. ఈ సినిమాలో దీపిక పదుకొణెను తీసేసిన సంగతి తెలిసిందే కదా. ఆమె ప్లేస్ లో ఎవరు నటిస్తారా అనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతుంది. ఈ సినిమాకు దీపిక పాత్ర ఎంత ఇంపార్టెంట్ అనేది మనకు తెలిసిందే. ఆ పాత్ర బలమైంది కాబట్టి దాన్ని ఆ స్థాయి ఫేమ్, యాక్టింగ్ స్కిల్స్ ఉన్న వారే చేయాలనే డిమాండ్ ఉంది. అందుకు తగ్గట్టే గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తుందని సమాచారం. దీపిక కంటే ప్రియాంకకు ఎక్కువ క్రేజ్ ఉంది. పైగా యాక్టింగ్ ఇరగదీస్తుంది. అయితే ప్రియాంకను తీసుకోవడం వెనకాల రాజమౌళి ఉన్నాడనే టాక్ మొదలైంది. రాజమౌళి డైరెక్షన్ లో వస్తున్న వారణాసిలో ప్రియాంక నటిస్తోంది.
ప్రియాంక యాక్టింగ్ స్కిల్స్, ఆమె క్రేజ్ చూసిన రాజమౌళి.. కల్కి-2 (Kalki 2) మూవీకి ఆమె పర్ ఫెక్ట్ ఛాయిస్ అని ప్రభాస్, నాగ్ అశ్విన్ కు చెప్పేశాడంట. పాన్ ఇండియా క్రేజ్ ఉన్న పాపులర్ హీరోయిన్ కోసమే నాగ్ అశ్విన్ కూడా చూస్తున్నాడు. ఇదే టైమ్ లో వారణాసిలో ప్రియాంక నటించడం ఇంకో ప్లస్ పాయింట్. కల్కి-2 కంటే ముందే వారణాసి రిలీజ్ అవుతుంది. ఆ మూవీతో ప్రియాంక క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోతుంది. అది కల్కి-2కి ప్లస్ అవుతుంది. అందుకే ప్రియాంకను తీసుకుంటున్నారంట. కొత్త ఏడాదిలో కల్కి-2 షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రభాస్ స్పిరిట్ సినిమాలో నటిస్తున్నాడు. దాంతో పాటే కల్కి-2ను పట్టాలెక్కించేలా ఉన్నాడు. త్వరలోనే దీనిపై అఫీషియల్ క్లారిటీ రాబోతోంది.
Read Also: జపాన్ వెళ్తున్న పుష్పరాజ్.. ఎన్టీఆర్ ను బీట్ చేస్తాడా..?
Follow Us On: WhatsApp Channel


