తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు(Telangana HC) నోటీసులు పంపించింది. ఐపీఎస్ అధికారులకు ఐఏఎస్ హోదా ఇవ్వడంపై వివరణ కోరింది. ఈ అంశంపై దాఖలైన పిటిషన్‌పై సోమవారం హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ చేసి వివరణ ఇవ్వాలని ఆదేశించారు.
సెప్టెంబర్ 26న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 1342 ప్రకారం కొందరు ఐపీఎస్ అధికారులకు ఐఏఎస్ హోదా కల్పించడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా శిఖా గోయల్, సీవీ ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర వంటి సీనియర్ ఐపీఎస్ అధికారులను ఐఏఎస్ క్యాడర్‌లో కొనసాగించడం చట్టపరంగా సరైంది కాదంటూ పిటిషన్ దాఖలైంది. పిటిషనర్ తరఫున న్యాయవాది విజయ్ గోపాల్ వాదనలు వినిపించారు.
పిటిషనర్ వాదనలు ఏమిటి?
‘ఐపీఎస్ అధికారులకు ఐఏఎస్ హోదా ఇవ్వడానికి చట్టపరమైన ప్రమాణాలు పాటించలేదు. కేంద్ర నియమాల ప్రకారం హోదా మార్పులు అవసరమైన ప్రక్రియలు, పరిశీలనల తర్వాత మాత్రమే చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలో ఈ ప్రమాణాలు పాటించకపోవడంతో అది చట్టవిరుద్ధం అవుతుంది’ అంటూ పిటిషన్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.
వాదనలు విన్న హైకోర్టు(Telangana HC), ఈ నిర్ణయానికి సంబంధించిన పూర్తి వివరణను తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి కోరింది. డిసెంబర్ 10లోపు సమగ్ర వివరణ సమర్పించాలని నోటీసులో పేర్కొంది. సంబంధిత రికార్డులు, జీవో జారీకి దారితీసిన కారణాలు, అనుసరించిన ప్రక్రియ వివరాలన్నింటినీ కోర్టు ముందుంచాల్సి ఉంటుంది.
Read Also: మునుగోడులో రాజగోపాల్ రెడ్డి రూల్.. అమల్లోకి కొత్త మద్యం రూల్స్
Follow Us On: X(Twitter)


