ఫైర్ బ్రాండ్, కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి(Renuka Chowdhury) మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటులో కరిచే కుక్కలు ఉన్నాయంటూ ఆమె కామెంట్ చేయడం గమనార్హం. సోమవారం శీతాకాల పార్లమెంటు సమావేశాలకు హాజరైన రేణుకా చౌదరి తన పెంపుడు కుక్కను తీసుకొని సమావేశాలకు వచ్చారు. భద్రతా సిబ్బంది అనుమతించినప్పటికీ, కొంతమంది బీజేపీ ఎంపీలు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. “పార్లమెంట్ వంటి ప్రతిష్ఠాత్మక భవనానికి పెంపుడు జంతువులను తీసుకురావడం సముచితం కాదని” విమర్శించారు. దీంతో రేణుకా చౌదరి స్పందిస్తూ.. ‘ఇది కరిచే కుక్క కాదు. కరిచే వాళ్లంతా లోపలే ఉన్నారు’ అంటూ వ్యాఖ్యానించిన రేణుకా చౌదరి మాటలు హాలులో ఉన్న వారిని ఆశ్చర్యానికి గురి చేశాయి. ఈ వ్యాఖ్య సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
బీజేపీ నేతలు ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. “పార్లమెంట్ గౌరవాన్ని దిగజార్చేలా మాట్లాడటం తగదు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, రేణుకా చౌదరి మాత్రం తనపై వస్తున్న విమర్శలను లెక్కచేయకుండా, “పార్లమెంట్‌లో అసలు ప్రాధాన్యత వహించాల్సిన సమస్యలను చర్చించకుండా ఇలాంటి చిన్న విషయాలపై గొడవలు పెట్టడం అవసరం ఏమిటి?” అని ప్రశ్నించారు.
Read Also: మోడీ విమర్శలకు ప్రియాంకా గాంధీ స్ట్రాంగ్ కౌంటర్
Follow Us On: X(Twitter)


