epaper
Monday, March 2, 2026
epaper

ఢిల్లీలో హైడ్రామా.. ప్రసిద్ధ ఆలయ పరిసరాల్లో కూల్చివేతలు

ఢిల్లీలోని గోరఖ్‌నాథ్ ఆలయ(Gorakhnath Temple) పరిసరాల్లో ప్రభుత్వం చేపట్టిన కూల్చివేతలను ప్రస్తుతం తీవ్ర చర్చలకు దారితీస్తున్నాయి. ఈ అంశం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ కూల్చివేతలపై అనేక మంది రాజకీయ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేరస్తున్నారు. విపక్షాలు ఈ చర్యలపై విమర్శలు గుప్పిస్తూ, “హిందూత్వ పేరుతో ప్రజల నుంచి ఓట్లు కోరుకున్న బీజేపీ, ఇప్పుడు హిందూ ఆలయాలపైనే చర్యలు తీసుకోవడం ఆశ్చర్యకరం” అని పేర్కొన్నాయి. ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయం సమీపంలో జరుగుతున్న ఈ కూల్చివేతలపై సంఘ్ నాయకులు స్పందించకపోవడంపై కూడా విపక్షాలు విమర్శస్తున్నాయి.

ఇదిలావుండగా, స్థానికులు కూడా ప్రభుత్వ చర్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆలయం పరిసరాల్లో జరుగుతున్న కూల్చివేతలు తమ భావోద్వేగాలను దెబ్బతీస్తున్నాయని, ముందస్తు సమాచారం లేకుండా అధికారులు చర్యలు చేపట్టారని వారి ఆరోపణ. వివాదం ముదురుతుండటంతో ఢిల్లీ ముఖ్యమంత్రి(Delhi CM) స్పందిస్తూ, “కూల్చివేతలు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కాదని, లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాల మేరకే అధికార యంత్రాంగం పనిచేస్తోంది” అని తెలిపారు.

కొంతమంది స్థానికులు ఈ వివాదంలో పాలకపక్షంపై విమర్శలు చేస్తూ, “ఇలాంటి విషయం పూర్వంలో కేజ్రీవాల్ ప్రభుత్వం హయంలో జరిగి ఉంటే బీజేపీ నేతలు తీవ్ర ఆందోళనలు చేసేవారు. ఇప్పుడు వారి ప్రభుత్వం ఉండడంతో నిశ్శబ్దంగా ఉంటున్నారు” అని వ్యాఖ్యానించారు. గోరఖ్‌నాథ్ ఆలయ(Gorakhnath Temple) ప్రాంతంలో జరిగిన కూల్చివేతలపై రాజకీయ వాదనలు, స్థానికుల ఆగ్రహం కొనసాగుతుండగా, అధికార యంత్రాంగం మాత్రం ఇది పరిపాలనా చర్య మాత్రమేనని స్పష్టం చేస్తోంది.

Read Also: SIR గడువు పొడిగింపు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!