కలం, వెబ్ డెస్క్: టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న సెమీస్‌లో జస్ప్రీత్ బుమ్రా(Bumrah) మ్యాజిక్ చేశాడు. తొలి బంతికే ఇంగ్లాండ్ కెప్టెన్ బ్రూక్ వికెట్ తీశాడు. ఇన్నింగ్స్ ఐదో ఓవర్ వేయడానికి వచ్చిన బుమ్రా, తను విసిరిన మొదటి బంతికే హ్యారీ బ్రూక్ (7) ను పెవిలియన్ పంపాడు. బుమ్రా వేసిన అద్భుతమైన స్లోయర్ బంతికి బ్రూక్ పూర్తిగా బోల్తా పడ్డాడు. బంతి గాలిలోకి లేవడంతో పాయింట్ ఫీల్డర్ అక్షర్ పటేల్ వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్లాడు. బంతి తన భుజంపై నుంచి కిందకు పడుతున్న తరుణంలో, డైవ్ చేస్తూ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. అప్పటికే ఇంగ్లాండ్ కెప్టెన్ బట్లర్ (25*) ఒంటరి పోరాటం చేస్తుండగా, బుమ్రా వేసిన ఈ దెబ్బతో ఇంగ్లండ్ 38 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
బుమ్రా(Bumrah) తన స్పెల్‌లో వేసిన ఫస్ట్ బాల్కే ఇంగ్లండ్‌ను దెబ్బకొట్టాడు. ఈ మ్యాచ్‌లో అక్షర్ పటేల్‌కు ఇది రెండో క్యాచ్. అంతకుముందు సాల్ట్ ఇచ్చిన క్యాచ్‌ను కూడా అక్షరే అందుకున్నాడు. 4.1 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ స్కోరు 38/2. భారీ లక్ష్యం ముందున్న సమయంలో వరుసగా వికెట్లు కోల్పోవడం ఆ జట్టుకు ఆందోళన కలిగిస్తోంది.

