Mobile Popup Ad
Mobile Popup Ad

గంజాయి కేసులో 20 ఏండ్ల జైలు శిక్ష.. 2 లక్షల జరిమానా

కలం, ఖమ్మం బ్యూరో: గంజాయి కేసులో ముగ్గురు నిందుతులకు ఒక్కొక్కరికి 20 ఏళ్ల జైలు శిక్షతోపాటు 2 లక్షల జరిమానా విధించబడింది. ఈ మేరకు మొదటి అదనపు జిల్లా మరియు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి కె. ఉమాదేవి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ వివరాల ప్రకారం ప్రకారం.. 2021 ఏప్రిల్ 7న ఖమ్మం (Khammam) జిల్లా రఘునాథపాలెం పోలీసులు వెంకటాపాలెం గ్రామ శివారులో వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఆ సమయంలో కారులోని వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. పోలీసులు తనిఖీ చేయగా 30 లక్షల విలువైన 194 కేజీల గంజాయి పట్టుబడింది.

నిందుతులను విచారించగా డొంకరాయ నుంచి హైదరాబాద్​కు గంజాయి (Ganja)  సరఫరా చేస్తునట్లు ఒప్పుకున్నారు. బూర్గంపాడు మండలం సారపాక చెందిన నిందుతులు బోడ వాల (26), కొండపల్లి రవి తేజ(25), బొజ్జ వంశీ(22) లపై కేసు నమోదు చేశారు. అనంతరం కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు. అభియోగం రుజువు కావటంతో 20 ఏండ్ల జైలు శిక్ష, రెండు లక్షల జరిమానా విధించబడింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>