కలం, వెబ్ డెస్క్: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ పశ్చిమ బెంగాల్లో అనూహ్య పరిణామం. ఆ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద బోస్(CV Ananda Bose) రాజీనామా చేశారు. దేశ రాజధాని ఢిల్లీ నుంచే ఆయన రిజైన్ చేసినట్లు బెంగాల్ లోక్‌భవన్ గురువారం వెల్లడించింది. తన రాజీనామా విషయాన్ని ఆనంద బోస్ ధ్రువీకరించారు. అయితే, కారణాలు మాత్రం చెప్పలేదు. ఈ రోజు ఉదయమే ఆయన తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపినట్లు సమాచారం.
మూడేన్నరేళ్ల కిందట పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా ఆనంద బోస్(CV Ananda Bose) బాధ్యతలు స్వీకరించారు. కేంద్రం, బెంగాల్ సీఎం మధ్య ఉప్పు నిప్పులా ఉన్న పరిస్థితుల్లో నెట్టుకొచ్చారు. ఆయన రాజీనామాపై సీఎం మమతా బెనర్జీ స్పందించారు. కొత్త గవర్నర్‌గా తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి రానున్నట్లు తనకు కేంద్ర హోంశాఖ ద్వారా తెలిసిందని చెప్పారు.

