Mobile Popup Ad
Mobile Popup Ad

దూబేను దెబ్బకొట్టిన పాండ్యా.. రన్‌ఔట్‌తో ముగిసిన దూకుడు ఇన్నింగ్స్

కలం, స్పోర్ట్స్:  ఇంగ్లండ్‌తో జరుగుతున్న సెమీస్ పోరులో దూబేను (Shivam Dube) పాండ్యా దెబ్బ కొట్టాడు. దూబే ఔట్ అవ్వడానికి పాండ్యానే కారణంగా మారాడు. రన్‌కు వచ్చినట్లే వచ్చి ఆఖరి క్షణంలో పాండ్యా ఆగపోయాడు. దాంతో దూబే రిటర్స్ వచ్చే క్రమంలో వికెట్ కోల్పోయాడు. మంచి దూకుడుతో ఆడుతున్న దూబే ఔట్ కావడంతో అభిమానులను తీవ్ర నిరాశ ఆవరించింది. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో శివం దూబే బ్యాట్‌తో మైదానంలో దుమ్మురేపాడు. వరుస సిక్సులతో స్కోర్‌బోర్డ్ పరుగులు పెట్టించాడు. కానీ చివరికి ఒక చిన్న అపార్థం అతని ఇన్నింగ్స్‌ను అనూహ్యంగా ముగించింది. ఇన్నింగ్స్ మధ్యలో వచ్చిన యార్కర్ బంతిని దూబే కష్టంగా ఆపాడు.

అదే సమయంలో హార్దిక్ పాండ్యా (Hardik Pandya) రన్‌కు పిలిచాడు. దూబే క్రీజ్ మధ్య వరకు వచ్చేసరికి పాండ్యా ఒక్కసారిగా రన్ రద్దు చేసినట్టు కనిపించింది. దాంతో దూబే వెంటనే తిరిగి క్రీజ్ వైపు పరుగెత్తాల్సి వచ్చింది. అప్పటికే షార్ట్ మిడ్‌వికెట్ దగ్గర ఉన్న హ్యారీ బ్రూక్ బంతిని అందుకున్నాడు. ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా నాన్‌స్ట్రైకర్ ఎండ్ స్టంప్స్‌పై డైరెక్ట్ హిట్ కొట్టాడు. దూబే (Shivam Dube) క్రీజ్ చేరుకునేలోపు బేల్స్ ఎగిరిపోయాయి. ఈ ఘటన తర్వాత పాండ్యా చేయి ఎత్తి క్షమాపణ చెప్పినట్టు కనిపించింది. దూబే మాత్రం అంతకుముందే తన దూకుడు చూపించాడు. కేవలం 25 బంతుల్లో 43 పరుగులు చేశాడు. ఒక ఫోర్, నాలుగు సిక్సులతో ఇంగ్లండ్ బౌలర్లపై దాడి చేశాడు.

Read Also: స్మార్ట్‌ఫోన్‌కు అడిక్ట్ అయ్యారా.. అయితే ఈ టెక్నిక్‌ను ఫాలోకండి!

Follow Us On : WhatsApp

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>