epaper
Thursday, March 5, 2026
epaper

హాస్టల్ విద్యార్థినులను కరిచిన ఎలుకలు

కలం, వరంగల్ బ్యూరో: హనుమకొండ (Hanumakonda) జిల్లాలోని హసన్ పర్తి మండలం ఎర్రగట్టుగుట్ట రోడ్డులో ఉన్న తెలంగాణ రెసిడెన్షియల్ బాలికల జూనియర్ కాలేజీలో ఎలుకలు (Rat Bite Incident) కలకలం సృష్టించాయి. హాస్టల్‌లో ఉన్న సమయంలో ఎలుకలు ముగ్గురు విద్యార్థినులను కరవడంతో వారు గాయపడినట్లు సమాచారం.

గాయపడిన విద్యార్థినులను వెంటనే స్థానిక హసన్ పర్తి గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో కాలేజీ, హాస్టల్‌లో విద్యార్థినుల మధ్య భయాందోళనలు నెలకొన్నాయి. ఈ సంఘటనపై పూర్తి వివరాలు  తెలియాల్సి ఉంది.

Read Also: చంద్రబాబూ బీకేర్‌ఫుల్.. మాణిక్కం ఠాకూర్ హెచ్చరిక

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!