కలం, వెబ్ డెస్క్: పశ్చిమాసియాలో యుద్ధం(Middle East War) మరింత విస్తరిస్తోంది. గురువారం ఆరో రోజు మరో మూడు దేశాలకు పాకింది. ఈ ఉదయం అజర్బైజాన్ రాజధాని బాకులోని అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇరాన్ డ్రోన్లతో దాడి చేసింది. ఈ ఘటనలో ఎంత మంది మరణించిందీ తెలియరాలేదు. ఈ దాడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అజర్బైజాన్.. తమ దేశంలోని ఇరాన్ రాయబారికి సమన్లు ఇచ్చింది. అజర్‌బైజాన్‌పై దాడికి కారణాలను ఇరాన్ వెల్లడించలేదు.
మరోవైపు టర్కీ, ఇరాక్‌పైనా డ్రోన్లు, బాలిస్టిక్ మిస్సైళ్లతో ఇరాన్ దాడికి దిగింది. యుద్ధంలో అమెరికాకు సహాయం చేస్తామని ఇరాక్‌కు చెందిన కుర్దిష్ దళాలు ప్రకటించడంతో ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ఇక, ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి తమ దేశంపై చొచ్చుకొచ్చిందని, భద్రతా దళాలు దానిని పేల్చేశాయని టర్కీ వెల్లడించింది. నాటో సభ్యదేశంపై దాడికి దిగితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించింది. అయితే, ఈ ఆరోపణను ఇరాన్ ఖండించింది. తాము టర్కీ మీద మిస్సైళ్లు ప్రయోగించలేదని స్పష్టం చేసింది.
ఖతార్, కువైట్, యూఏఈపై..
అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా గురువారం సైతం ఖతార్, కువైట్, యూఏఈపై ఇరాన్ మిస్సైళ్లతో విరుచుకుపడింది. దోహాలోని విమానాశ్రయంపై డ్రోన్లు దాడి చేశాయి. దుబాయ్, అబుదాబి, కువైట్‌లోనూ ఇరాన్ దాడులు కొనసాగుతున్నాయి.
మా సైనికులు ఆరుగురు చనిపోయారు : యూఎస్
ఇరాన్‌తో యుద్ధంలో (Middle East War) ఇప్పటివరకూ తమ సైనికులు ఆరుగురు చనిపోయినట్లు వాషింగ్టన్‌లోని అమెరికా ప్రభుత్వ ప్రధాన కార్యాలయం పెంటగాన్ వెల్లడించింది. కువైట్‌లో ఇరాన్ డ్రోన్ దాడిలో వీళ్లు మరణించినట్లు తెలిపింది. ఇందులో మేజర్ జెఫ్రీ ఓబ్రియన్(45), కెప్టెన్ కాడీ ఖోర్క్(35), నికోల్ అమోర్(39), నోవా తియోత్సెన్స్(42), డెక్లాన్ కాడీ(20) చనిపోయారని పేర్కొంది. చనిపోయిన మరో సైనికుడి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించింది.
Read Also: తెలంగాణ IPS కు అమిత్ షా బంపర్ ఆఫర్
Follow Us On : WhatsApp

