epaper
Thursday, March 5, 2026
epaper

ఖమేనీ మృతిపై స్పందించిన భారత్​

కలం, వెబ్​ డెస్క్​: ఇరాన్​ సుప్రీం లీడర్​ అయతొల్లా మృతిపై భారత్​ తొలిసారి స్పందించింది. ఖమేనీ మృతికి తీవ్ర సంతాపం తెలిపింది. ఈ మేరకు ఢిల్లీలోని ఇరాన్​ రాయబార కార్యాలయానికి గురువారం విదేశాంగ కార్యదర్శి విక్రమ్​ మిస్రీ(Vikram Misri) వెళ్లారు. ఇరాన్​ రాయబారిని కలిశారు. ప్రభుత్వం తరఫున సంతాపం ప్రకటించారు. అనంతరం సంతాప సందేశాన్ని రాసి, సంతకం చేశారు.

కాగా, అణ్వాయుధాలు తయారుచేస్తోందంటూ ఇరాన్​పై ఇజ్రాయెల్​–అమెరికా (Israel – US) సంయుక్త దాడులు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో ఇరాన్​ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ ఆదివారం మరణించారు. అయితే, ఆయన మృతిపై భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేదు. దీనిపై ప్రతిపక్షాలు కేంద్రాన్ని, ప్రధాని మోదీని ప్రశ్నించాయి. కాంగ్రెస్​ నాయకురాలు సోనియా గాంధీ, లోక్​సభలో ప్రతిపక్ష నేత, ఎంపీ రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తదితరులు ప్రధాని మోదీ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ఈ క్రమంలో ఖమేనీ మృతి చెందిన నాలుగు రోజుల తర్వాత తొలిసారి ఈ రోజు భారత్​ స్పందించింది. ఆయన మృతికి విదేశాంగ కార్యదర్శి(Vikram Misri) ద్వారా  తీవ్ర సంతాపం తెలిపింది.

Read Also: మరో మూడు దేశాలకు పాకిన యుద్ధం

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!