epaper
Thursday, March 5, 2026
epaper

మాదిగలకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తోంది: మంద కృష్ణ మాదిగ

కలం,వెబ్ డెస్క్ : కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) మాదిగలకు అన్యాయం చేస్తున్నారని మందకృష్ణ మాదిగ (Manda Krishna Madiga) తీవ్రంగా విమర్శించారు. రాజ్యసభకు మాదిగ వర్గానికి చెందిన ఒక్కరినీ కూడా ఎంపిక చేయకపోవడం బాధాకరమని అన్నారు. మాదిగలకు లోక్‌సభలోనే కాకుండా ప్రస్తుతం రాజ్యసభలో కూడా ప్రాతినిధ్యం లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన రాజకీయ జీవితంలో మాదిగలు ఎప్పుడూ అండగా ఉన్నారని చెప్పే రేవంత్ రెడ్డి ఇప్పుడు మాదిగలను రాజకీయంగా అణిచివేస్తున్నారని ఆరోపించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కాలంలో మాదిగలకు లోక్‌సభ, రాజ్యసభల్లో ప్రాతినిధ్యం ఉండేదని, కానీ ప్రస్తుతం రేవంత్ సర్కార్‌లో మాత్రం వివక్షకు గురవుతున్నారని పేర్కొన్నారు. తన స్నేహితుడైన వేం నరేందర్ రెడ్డిని ఎంపిక చేస్తున్నట్లు వార్తలు రావడం తమకు బాధ కలిగించాయి. ఎస్సీ వర్గీకరణ విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని మంద కృష్ణ మాదిగ (Manda Krishna Madiga) ఆరోపించారు. గతంలో ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు వర్గీకరణ అమలు చేస్తామని చెప్పినా అమలు కాలేదని తెలిపారు. ఎస్సీ వర్గీకరణలో మాదిగలకు కేవలం 9 శాతం రిజర్వేషన్లు మాత్రమే ఇవ్వడం అన్యాయమని, మాలల ఒత్తిడికి తలొగ్గి ప్రభుత్వం ఇలా చేస్తున్నదని విమర్శించారు.

ఇటీవల కోదాడలో లాకప్ డెత్ లో మాదిగ బిడ్డ కర్ల రాజేష్ చనిపోవడంలో పోలీసుల పాత్ర ఉంది. చిత్రహింసలకు గురిచేసి చంపారు. ఈ ఘటనపై ఇప్పటివరకు ముఖ్యమంత్రి స్పందించకపోవడం దారుణమని ఆయన అన్నారు. ఎస్సై సురేష్ రెడ్డిని కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సమయంలో మరియమ్మ లాకప్ డెత్ ఘటన జరిగితే వెంటనే సంబంధిత పోలీసులను విధుల నుంచి తొలగించి ఆ కుటుంబాన్ని ఆదుకున్నారని గుర్తు చేశారు.

Read Also: కలెక్టర్ అంకిత్ ఆన్ డ్యూటీ.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆకస్మిక తనిఖీలు!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!