కలం, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల (Vijay-Rashmika) రిసెప్షన్ (Reception) హైదరాబాద్‌లో ఘనంగా జరుగుతోంది. ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో సన్నిహితుల మధ్య అంగరంగ వైభవంగా వెడ్డింగ్ జరిగింది. బుధవారం సాయంత్రం హైదరాబాద్ తాజ్ కృష్ణాలో రిసెప్షన్ ఏర్పాటుచేశారు. కేవలం ఆహ్వానితులకు మాత్రమే పరిమితమైన ఈ వేడుకకు ఇరు కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులు హాజరయ్యారు.
అలాగే తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వేడుకల్లో సీఎం రేవంత్ సతీమణి గీతారెడ్డి, అక్కినేని ఫ్యామిలీ, ఎంపీ మల్లు రవి, మాజీ మంత్రి దయాకర్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావు, డీకే అరుణ, ఇతర ప్రముఖులు హాజరై సందడి చేశారు. అభిమానులు ముద్దుగా పిలుచుకునే విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్ సందర్భంగా తాజ్ కృష్ణా పరిసరాల్లో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

