epaper
Wednesday, March 4, 2026
epaper

వరుణ్‌లో టెన్షన్ కనిపిస్తోంది: కైఫ్

క‌లం, వెబ్ డెస్క్‌: ముంబై వేదికగా ఇంగ్లాండ్‌తో జరగనున్న టీ20 ప్రపంచకప్ (T20 World Cup) సెమీఫైనల్‌కు టీమ్ ఇండియా సిద్ధమవుతోంది. అయితే, ఈ బిగ్ మ్యాచ్‌కు ముందు భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy) ఫామ్‌పై మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ (Mohammad Kaif) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ టోర్నీలో వరుణ్ ప్రయాణం ఒడిదుడుకులతో సాగుతోంది. గ్రూప్ దశలో నాలుగు మ్యాచ్‌ల్లో తొమ్మిది వికెట్లు తీసి అదరగొట్టిన ఆయన, సూపర్-8 దశకు వచ్చేసరికి తడబడ్డారు. అక్కడ మూడు మ్యాచ్‌ల్లో కేవలం మూడు వికెట్లు మాత్రమే తీసి, ఓవర్‌కు పది పరుగులకు పైగా సమర్పించుకున్నారు. ఈ నేపథ్యంలో మార్చి 3న తన యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడిన కైఫ్.. వరుణ్ బౌలింగ్‌లో లోపాలను ఎత్తి చూపారు.

వరుణ్‌ను ఎదుర్కోవడానికి బ్యాటర్లు ఇప్పుడు పక్కా ప్లాన్‌తో వస్తున్నారని కైఫ్ (Mohammad Kaif) విశ్లేషించారు. ఒక్కోసారి తన బౌలింగ్‌లో పరుగులు వస్తుంటే వరుణ్ కంగారు పడుతున్నారని, ఆ సమయంలో తన సహజసిద్ధమైన వికెట్-టు-వికెట్ లెంగ్త్‌ను వదిలేసి నెగటివ్ లైన్‌లో బౌలింగ్ చేస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా బ్యాటర్ల ప్యాడ్లను లక్ష్యంగా చేసుకుని బౌలింగ్ చేయడం వల్ల వరుణ్ వికెట్లు తీయలేకపోతున్నారని అభిప్రాయపడ్డారు.

Read Also: పాక్ ఆటగాళ్లపై భారీ జరిమానా.. షాహిద్ అఫ్రిది కీలక వ్యాఖ్యలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!