Mobile Popup Ad
Mobile Popup Ad

ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి.. పలువురికి గాయాలు

కలం, వెబ్​ డెస్క్​ : రాజన్న సిరిసిల్ల (sircilla) జిల్లా కోనరావుపేట మండలం పల్లె నిజాంబాద్ గ్రామంలో బుధవారం ఉదయం విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని ఉపాధి హామీ పనుల్లో నిమగ్నమైన కూలీలపై ఒక్కసారిగా తేనెటీగలు విరుచుకుపడ్డాయి. తేనెటీగల బారి నుంచి తప్పించుకోవడానికి కూలీలు పరుగులు తీసినప్పటికీ పది మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.

తేనెటీగల దాడిలో అస్వస్థతకు గురైన బాధితులను తోటి కూలీలు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. బాధితుల పరిస్థితి ప్రస్తుతానికి నిలకడగానే ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో గ్రామస్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.

Read Also: రెండు చేతులు లేకపోయినా పారా ఆర్చరీలో అద్భుతాలు.. పాయల్ సరికొత్త చరిత్ర

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>