కలం, వెబ్ డెస్క్: పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ఇజ్రాయెల్–అమెరికా దళాల దాడులతో హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. ఈ క్రమంలో ఇంధన నిల్వల(Crude Oil – Gas) కొరత వస్తుందనే ఆందోళనలపై కేంద్రం స్పందించింది. ఎలాంటి ఆందోళన వద్దని, 25 రోజులకు సరిపడ క్రూడాయిల్, గ్యాస్ నిల్వలు ఉన్నాయని మంగళవారం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులను ఉటంకిస్తూ నేషనల్ మీడియా పేర్కొంది.
‘క్రూడాయిల్, ఎల్పీజీ, ఎల్ఎన్జీ నిల్వల విషయంలో మనం కంఫర్టబుల్ పొజిషన్లోనే ఉన్నాం. ప్రస్తుతం మన వద్ద 25 రోజలకు సరిపడ ఇంధన నిల్వలు ఉన్నాయి. మరో 25 రోజులకు సరిపోయే ఆయిల్ ఉత్పత్తులు రవాణాలో ఉన్నాయి’ అని అధికారులు వెల్లడించినట్లు తెలిపింది.
కాగా, హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) మూసివేతతో ఆయిల్ ఉత్పత్తుల(Crude Oil – Gas) సరఫరాపై ఆందోళనలు పెరిగాయి. ప్రపంచ క్రూడ్ ఆయిల్లో ఐదో వంతు ఈ జలసంధి ద్వారానే రవాణా అవుతుంది. ఈ క్రమంలో తమపై ఇజ్రాయెల్–అమెరికా దళాల దాడులకు ప్రతిగా ఈ జలసంధిని మూసివేసినట్లు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) కమాండర్ సలహాదారు ఇబ్రహీం జబ్బారి ప్రకటించారు. ఎవరైనా దాటాలనుకుంటే తీవ్ర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
అనంతరం జలసంధి నుంచి దాదాపు 90% క్రూడ్ రవాణా నిలిచిపోయింది. సాధారణంగా రోజుకు 100కు పైగా ట్యాంకర్లు ఈ మార్గం నుంచి దాటితే, ఆదివారం మూడు మాత్రమే దాటగలిగాయి. సోమవారం ఆ సంఖ్య ఒక్కటికి పడిపోయింది. జలసంధిని దాటే ప్రయత్నంలో కొన్ని ఓడలు, ఆయిల్ ట్యాంకర్లు దాడికి గురయ్యాయి.
Read Also: కేసీఆర్తో కేటీఆర్ భేటీ.. వాటిపైనే చర్చ
Follow Us On: X(Twitter)

